TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శిల్పాచక్రపాణిపై కత్తికట్టిన మాజీ మంత్రి ఫరూక్

Published on: Tue Mar 13, 2012 10:42AM

కర్నూలు: కర్నూలుజిల్లాకు చెందిన మాజీ మంత్రి ఫరూక్ ఇటీవల తెలగుదేశం పార్టీలో చేరిన శిల్పాచక్రపాణిరెడ్డిపై కత్తికట్టారు. ఎమ్మెల్యే శిల్పామోహన్ రెడ్డి సోదరుడైన చక్రపాణిరెడ్డికి నంద్యాల నియోజకవర్గంలో గట్టిపట్టు ఉంది. ఆయనకు కమిట్ మెంట్ గల కేడర్ కూడా అక్కడ ఉంది. నంద్యాల నియోజకవర్గంలో మాజీ మంత్రి ఫరూక్ పోటీ చేయాలనుకుంటున్నారు. శిల్పాచక్రపాణిరెడ్డి తెలుగుదేశంపార్టీలో చేరేముందు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో ఫరూక్ కు గట్టి హామీ ఇస్తూ నంద్యాలలోని తన కేడర్ అంతా ఫరూక్ కే మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. పార్టీలో చేరిన తరువాత శిల్పాచక్రపాణి రెడ్డి ఆ హామీని గాలికి వదిలేశారు. నంద్యాలలోని ఆయన అనుచరులెవరూ ఫరూక్ కు సహకరించడంలేదు. దీంతో ఫరూక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శిల్పాచక్రపాణిరెడ్డి వైఖరి మారకపోతే తాను ఆయనపై చంద్రబాబునాయుడుకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.