నిరసన సెగలు.. ప్రభుత్వ చీఫ్ విప్ పిన్నెల్లి కారుని ధ్వంసం చేసిన రైతులు

ప్రభుత్వ ఛీవ్ విప్ పిన్నెల్లికి రాజధాని సెగ తగిలింది. చినకాకాని గ్రామం దగ్గర పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అడ్డుకున్నారు రైతులు. ఆయన కారు పై రాళ్లు రువ్వి కారు అద్దాలు ధ్వంసం చేశారు ఆందోళనాకారులు. పిన్నెల్లి కారు ఎదురుగా కూర్చుని ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. చినకాకాని దగ్గర పరిస్థితి ఉధృక్తంగా మారుతోంది. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ముందు వెళ్ళే కారును నిలిపి వేయడంతో ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.అందులోనే ఎమ్మెల్యే కారు కూడా నిలిచిపోయింది. తక్కువ వాహనాలు ఉండటంతో ఒక్క సారిగా అక్కడ ఉన్న రైతులంతా కూడా ఆ కారు వద్దకు వచ్చారు.మొదట ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గన్ మెన్ తో అక్కడ ఉన్న రైతులు వాగ్వాదానికి దిగారు.గన్ మెన్ రైతులకు సమాధానం చెప్తున్న సమయంలో ఒక్కసారిగా దాడి జరిగింది. పెద్ద ఎత్తున రాళ్లురువ్వి కర్రలు తీసుకుని అద్దాలు పగలగొట్టారు.మొదటగా కారు వెనుక గ్లాసుల పగలగొట్టిన ఆందోళనకారులు ఆ తరువాత ఎమ్మెల్యే ముందు సీట్లోనే ఉండటాన్ని గమనించి ముందువైపు రాళ్లు విసరి కొట్టడంతో దాదాపుగా ముందుగ్లాసు పగిలిపోయింది. ఎమ్మెల్యే కారును పంపిచే ప్రయత్నమైతే చేశారు డీఎస్పీ సీతారామయ్య.  దాదాపు 4 గంటలకు పైగా రైతులు ఆందోళన చేశారు.  ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా హైవేను ఇప్పటి వరకు సర్ధుబాటు చేయలేకపోయారు పోలీసులు.మొత్తం మీద ఆ ప్రాంతం నుంచి వాహనాలను ముందుకు కదిలించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదనే అంటున్నారు అధికారులు.