TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మాట తప్పను-రుణమాఫీ చేస్తా: చంద్రబాబు

Published on: Wed Jul 16, 2014 1:48PM

 

తాను ఎట్టి పరిస్థితుల్లోనూ మాట తప్పే వ్యక్తిని కానని, రైతుల రుణాలను తప్పకుండా మాఫీ చేస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రైతు రుణ మాఫీ విషయంలో తాను బుధవారం కూడా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌తో మాట్లాడానని, రుణ మాఫీ విషయంలో ఏవైనా సమస్యలుంటే ముందుగా రుణాలను రీ షెడ్యూలు చేయాలని అభ్యర్థించానని చంద్రబాబు చెప్పారు. ఈ విషయంలో కొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం వుందని ఆయన తెలిపారు.