TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నకిలీ విత్తనాల వ్యాపారిపై నందిగామరైతుల ఆగ్రహం?

Published on: Fri Jun 29, 2012 2:15PM

నకిలీ విత్తనాలు సరఫరా చేసిన వ్యాపారిపై కృష్ణాజిల్లా నందిగామ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యాపారిపై చర్యలు తీసుకోకుంటే తమ ఆందోళన తీవ్రతరమవుతుందని రైతులు అధికార్లను హెచ్చరించారు. నందిగామ నల్లబజారులో మైకోకంపెనీకి చెందిన నీరజ పత్తివిత్తనాలు మొలకెత్తకపోవటంతో రైతులు వ్యాపారి ఆదినారాయణను కలిశారు. ఆయన కోపంగా రైతులను దూషించారు. దీంతో అగ్గిమీద గుగ్గిలంలా శాంతిభద్రతల సమస్యలా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి రైతులను ఎమ్మార్వో కార్యాలయానికి రావాలని కోరారు. వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మార్వో బి.శ్రీనివాసరావు, వ్యవసాయాథికారి ఖాసిం, ఎస్‌ఐలకు రైతులు తమ గోడు వినిపించుకున్నారు. తమకు ఆదినారాయణ 41నీరజ్‌ డబ్బాలను రూ.2750, కొన్నింటిని రూ.1750కు అమ్మారని తెలిపారు. పర్మిట్ల ప్రకారం తాము కొన్న విత్తనాలు మొలకెత్తినా, ఆదినారాయణ అమ్మిన విత్తనాలు మొలకెత్త లేదని వివరించారు. వ్యాపారిపై కఠిన చర్యలు తీసుకోకుంటే రైతుల ఆందోళనను ఎదుర్కోవాల్సి ఉంటుందని వారు అధికార్లను హెచ్చరించారు.