Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ధర రాక టమాటాలను ఫ్రీగా పంపిణీ చేసిన రైతులు
posted on: Feb 21, 2026 1:24PM

అమ్మబోతే అడవిలా తయారైంది టమాటా రైతుల పరిస్ఖితి. ఆరుగాలం కష్టించి పండించిన టమాటా పంట అమ్ముకుందామని మార్కెట్కు తీసుకువస్తే గిరాకీ లేక ధర పూర్తిగా పడిపోవడంతో చేసేది లేక తీసుక వచ్చిన టమాటాను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసిన సంఘటన మహబుబాబాద్ జిల్లా కొత్తగూడలో చోటు చేసుకుంది.
కొత్తగూడలో ప్రతి శుక్రవారం వారంతపు సంత జరుగుతుంది. ఈ రోజు శుక్రవారం (ఫిబ్రవరి 21) కావడంతో మార్కెట్‌కు టమాటా రైతులు భారీగా టమాట తీసుక రావడం జరిగింది. గత కొద్ది రోజులుగా టమాటా ధర పూర్తి తగ్గి పది రూపాలకు రెండు కీలోల చోప్పున అమ్ముతున్నారు. సంతకు పెద్ద ఎత్తున టమాటా రావడంతో ఆశించిన స్థాయిలో గిరాకీ లేకపోవడంతో పాటు, ధరలు దారుణంగా పడిపోయాయి.
దీంతో తీవ్ర నిరాశకు లోనైన రైతులు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేకపోవడం, తిరిగి ఇంటికి తీసుకెళ్లడం భారంగా మారడంతో.. చేసేదేమీ లేక టమాటాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు రైతులు. ఫ్రీ.. ఫ్రీ.. టమాటాలు ఫ్రీ అంటూ రైతులు పిలుపునివ్వడంతో స్థానికులు టమాటాల కోసం ఎగబడ్డారు. పెట్టుబడులు పెట్టి మంచి దిగుబడులు తీసిన రైతన్న అమ్ముకునే పరిస్థితి లేక పోడంతో పుట్టెడు దుఃఖాన్నిదిగమింగి ఖాళీచేతులతో ఇంటి దారిపట్టాడు.



.webp)


