TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రైతులను మోసం చేస్తున్న బిటి కంపెనీలు?

Published on: Thu Oct 4, 2012 7:55AM

Farmers Deceived, BT Seeds Companies, Guntur, Vijayawada, Kurnool, Mahaboob Nagar, Agriculture Department Officials, People Health, Natural Farming, Japan Scientists, Experiments

సాంప్రదాయక వ్యవసాయానికి రాష్ట్రానికి ఉన్న పేరును బిటి విత్తనాల కంపెనీలు పాడు చేశాయి. ఒకపక్క రైతులను మోసం చేశాయి. మరోపక్క తాము సొమ్ము చేసుకుని రాష్ట్రప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడాయి. ఈ కంపెనీలు ఇప్పటికే దేశంలో రెండు వేల కోట్ల రూపాయల వాణిజ్యాన్ని చేస్తున్నాయి. రాష్ట్రంలోని గుంటూరు, విజయవాడ, కర్నూలు, మహబూబ్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో ఇప్పటికీ బిటి విత్తనాలు వినియోగిస్తున్నారు. ప్రత్యేకించి పత్తి ఉత్పత్తి ఎక్కువగా వస్తుందని ఈ విత్తనాలు ఉపయోగించాలని వ్యవసాయశాఖాధికారులు కోడైకూశారు. దీంతో రైతులు అధికారుల సూచనలు నమ్మి ఈ విత్తనాలు ఉపయోగించారు. ఇప్పుడు తాజాగా జరిగిన పరిశోధనల్లో బిటి విత్తనాలు ఉపయోగిస్తే భూసారం దెబ్బతింటుందని తేలింది. మనదేశ వ్యవసాయంపై దృష్టిసారించిన జపాన్‌ శాస్త్రవేత్తలు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. పైగా, ఈ బిటి విత్తనాలు ద్వారా వేసిన పంట నుంచి తీసిన నూనె కూడా ఆరోగ్యానికి హానికరమని పరిశోధకులు తేల్చి చెప్పారు. ఆ నూనె వినియోగిస్తే ఆరోగ్యాన్ని కాపాడటం వైద్యుల చేతిలో ఉండదని కూడా హెచ్చరించారు. తమ స్వార్థం కోసం బిటి కంపెనీలు వ్యవసాయాధికారుల సహకారంతో రాష్ట్ర రైతాంగాన్ని సాంప్రదాయపంటల నుంచి మళ్లించకుండా ఉంటే పరిస్థితి కొంతమేర ఆశాజనకంగా ఉండేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎక్కువ బిటి విత్తనవినియోగం వల్ల భూసారం దెబ్బతిందేమోనని రైతులు తక్షణం ఒకసారి పరిశోధనలు చేయించాలని వారు సూచిస్తున్నారు. జపాన్‌ వంటి దేశాలు కూడా సాంప్రదాయపంటలుగా జొన్న వంటి వాటిపై ఆధారపడినప్పుడు రాష్ట్రరైతులు విదేశీవిజ్ఞానాన్ని వినియోగించుకోవటం మానుకోవాలని సూచిస్తున్నారు. ప్రత్యేకించి వెంటనే అప్రమత్తమై రైతులు తక్షణ జాగ్రత్తలు చేపట్టాలని సూచిస్తున్నారు. ఈ నిపుణుల సూచనలను మహారాష్ట్ర వ్యవసాయవిశ్వవిద్యాలయం మాజీ వైస్‌ఛాన్సలర్‌ సిడి మహీ కూడా బలపరుస్తున్నారు.