తూర్పు రైతులను ముంచిన పయనీర్
Published on: Mon Feb 27, 2012 2:15PM
హైద
రాబాద్: పయనీర్ అనే ప్రైవేట్ కంపెనీ విక్రయించిన 27పి31 రకం వరి విత్తనాలు తూర్పుగోదావరి జిల్లాలో వందలాది మంది రైతులకు నట్టెట ముంచాయి. వందలాది ఎకరాల్లో గత సీజన్ లో ఈ రకం వరి విత్తనాలకు వాడటంవల్ల దిగుబడి బాగా తగ్గిపోయి రైతులు అపార నష్టం వాటిల్లింది. పంటలో 90శతం పొల్లు ఉందని మార్టేరు వరి పరిశోధనా కేంద్రానికి చెందిన శాస్త్రవేత్తలు నిర్ధారించారు. దీంతో తమకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలంటూ బాధిత రైతులు పయనీర్ కంపెనీకి వ్యతిరేకంగా అందోళనను చేపడుతున్నారు. నిజానికి ఈ వరివంగడాన్ని వ్యవసాయశాఖ,వరి పరిశోధనా సంస్థలు సిఫార్సు చేయలేదు. కానీ పయనీర్ కంపెనీ ఉద్యోగులు అధిక దిగుబడి వస్తుంది, చీడపీడలను తట్టుకుంటుందని మాయమాటలు చెప్పి అనేక క్వింటాళ్ళ వరి విత్తనాలను రైతులు అంటగట్టారు. ఫలితంగా తూర్పుజిల్లాలోని రైతులు కోట్లాది రూపాయలమేర నష్టానికి గురయ్యారు.


