TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

'మన గ్రోమోర్' షాపుల్లో నాశిరకం మందులు?

Published on: Mon Feb 20, 2012 9:53AM

నష్టపోతున్న రాష్ట్ర రైతాంగం
తె
లుగువన్.కామ్ ప్రత్యేక కధనం
హైదరాబాద్: గ్రోమోర్ ఎరువుల గురించి రాష్ట్రంలో తెలియని రైతులంటూ ఎవరూ ఉండరు. ఈ కంపెనీపై రైతులకు నమ్మకం ఎక్కువే. ఈ కంపెనీ గ్రామీణ, చిన్న చిన్న పట్టణాల్లో రైతుల కోసం ఔట్ లెట్ లను ఏర్పాటు చేసి ఎరువులను, పురుగుల మందులను విక్రయిస్తోంది. అయితే ఇక్కడ విక్రయిస్తున్న కొన్ని పురుగుల మందుల్లో నాశిరకం మందులున్నట్టు తేలింది. అసిఫెట్     75ఎస్,పి 11111901బ్యాచ్ కు చెందిన అసిఫెట్ సాలిబుల్ పౌడర్ ప్యాకెట్లు పరిశీలించగా ఈ విషయం తేలింది. ఐఎస్ఐ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాల్సిన ఈ మందులు అత్యంత నాశిరకంగా ఉన్నట్లు తేలింది. ఈ విషయం మొదట గుంతకల్లులో బైట పడటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రోమోర్ ఔట్ లెట్ లపై వ్యవసాయశాఖ దృష్టి సారించింది. గ్రోమోర్ సంస్థ బహుళ జాతి సంస్థ అయినప్పటికీ, ఇక్కడ లభించే ఉత్పత్తుల ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ నాశిరకం క్రిమిసంహారక మందులను విక్రయించడం పట్ల రైతులు దిగ్బ్ర్హాంతి వ్యక్తం చేస్తున్నారు. ధర ఎక్కువైనప్పటికీ ఇక్కడే తాము మందులు కొనుగోలు చేస్తున్నామని కాని ఈ మందులు వల్ల తమ పంటలు పాడైతే నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు.