TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నీటిసంఘాల పదవీకాలం మరో ఏడాది పొడిగింపు

Published on: Fri Feb 17, 2012 10:22AM

హైదరాబాద్:  నీటి వినియోగదారుల సంఘాల పదవీకాలాన్ని ప్రభుత్వం మరో ఏడాది కాలం పెంచుతూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన సంఘాల ఎన్నిక నిమిత్తం ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా మరోసారి పదవీకాలాన్ని పొడిగించడం రైతు సంఘాలను, రాజకీయ పక్షాలను నిరాశకు గురిచేసింది. 2008 ఎన్నికల్లో ఏర్పడిన నీటి వినియోగదారుల సంఘాల పదవీకాలాన్ని ఇప్పటి వరకు రెండుసార్లు పొడిగించింది. పంచాయితీ, మండల, జిల్లా పరిషత్, సహకార సంఘాల ఎన్నికల మాదిరిగానే నీటి సంఘాల ఎన్నికలకు ప్రభుత్వం వెనుకడుగు వేసి వాయిదా మార్గాన్ని ఎంచుకుని పదవీకాలం పొడిగించడం గమనార్హం.