Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హెలికాప్టర్ కోసం బ్యాంక్ రుణం కోరిన రైతు
posted on: Jul 14, 2022 9:02PM
రైతే రాజు.. ఒకప్పటి మాట. ఈరోజుల్లో రైతు కష్టాలు ఎవరికీ వద్దురా బాబూ అనిపిస్తుంది. ఊహించని కష్టాలు అనుభవించిన మహారాష్ట్ర రైతు ఒకతను మన ఊహకి అందని చిత్రమైన ఆలోచన చేశాడు. ఎవరైనా పిల్లల చదవుకో, ఇల్లు కట్టుకోవడానికో, వ్యవసాయ పనులకో బ్యాంక్ రుణాలు తీసుకుంటారు. కానీ మహారాష్ట్ర హింగోలీ కి చెందిన కైలాష్ పతంగే మాత్రం ఏకంగా హెలికాప్టర్ కొనడానికి రుణం కావాలని బ్యాంక్ వారిని సంప్రదించాడు. 6.6 కోట్ల రుణం కావాలని దరఖాస్తు చేసుకున్నాడు. బ్యాంక్ అధికారులు, ఈ సంగతి విన్నవారూ కొంతసేపు ఆశ్చర్యం నుంచీ బయటపడలేదు. ఒక్కరిద్దరైతే గట్టిగా నవ్వారు, ఇంకొందరు వీడికేమైనా పిచ్చిగాని పట్టిందేమో.. అనీ అనుకున్నారు. పిచ్చి ఆ రైతుకి పట్టలేదు. ఆ తెలివైన ఆలోచన చదువుకున్నవారికి రాలేదు.
గింజలు, ఎరువుల నాణ్యత లోటు, తగినంత విద్యుత్ సౌకర్యం లేకపోవడం, గిట్టుబాటు ధరకోసం అందరితో గొడవలు, అవమానాలు, వీటికీ తోడు అకాల వర్షాలూ రైతు జీవితాన్ని కుంగదీస్తున్నాయి. దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ రైతుల వ్యధ ఇలానే వుంది. పంటమార్పిడి, ఆధునిక సేద్యా విధానాలు అనుసరించడంలో మధ్యవర్తులు, దళారీల మోసాలు ఒక్కటేమిటి అంతా సమస్యల వలయమే. మధ్యలో బిక్కు బిక్కుమంటూ రైతు. ఇలాంటి బాధలు అనుభవించే ఒక రైతు ఎవ్వరూ ఊహించని ఆలోచన చేశాడు.
తన రెండెకరాల భూమిలో వ్యవసాయం చేయడం ఇక తనవల్ల కావడం లేదని తేల్చుకున్నాడు గోరెగోవ్ జిల్లా తక్తోడా గ్రామానికి చెందిన పతంగే. రెండేళ్లుగా సోయాబీన్స్ పంట వేస్తున్నాడు. కానీ దాని వల్ల పెద్దగా ప్రయోజనం కలగలేదు. పైగా అకాల వర్షాలు పెద్ద సమస్యనే తెచ్చిపెట్టాయిట. ఒక రోజంతా ఆలోచించి అతను బ్యాంక్‌కి వెళ్లి రుణం అడిగేడు. హెలికాప్టర్ కొనడానికి అని బ్యాంక్ వారి ప్రశ్నలకు ఒకే సమాధానం ఇచ్చాడు. హెలికాప్టర్ ఏం చేస్తావన్నారు. అతగాడు తడుముకోకుండా దాన్ని అద్దెకి తిప్పుతానన్నాడు. బ్యాంక్ మేనేజర్, ఉద్యోగులు నోరెళ్లబెట్టారు.. ఆహా ఏమి ఆలోచన చేశావయ్యా.. అన్నారంతా. ఆనక నవ్వు కున్నారంతా. కానీ పతంగెకి కోపం రాలేదు. చాలా ప్రశాంతంగా.. అయ్యా, మీరు నవ్వుతున్నారుగానీ, మాబోటి వారికి పెద్ద పెద్ద కలలు కనే అర్హత లేదా? ధనికులేనా పెద్ద కలలు కనేది? అని వాళ్ల నోళ్లు మూయించాడు. పైగా వేరే ఏదన్నా వ్యాపారం చేసు కుందామంటే పెద్ద పోటీనే ఎదుర్కోవాలి గనుక దీన్ని ఎంచుకున్నానన్నాడు. రైతు తెలివి ముందు ఆఫీసర్లు డంగ్ అయ్యారు.






