తిరుపతి లడ్డుల్లో మేకుల సంగతేంటి?
Published on: Fri Apr 27, 2012 10:46AM
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతి లడ్డు పంపిణీ మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అందులో భాగంగా లడ్డు కౌంటర్లలో పనిచేసే సిబ్బందికి చేతులకి గ్లౌజులు, తలకు టోపీలు తగిలించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఈ నిర్ణయం మంచిదే, వాస్తవానికి లడ్డు కౌంటర్లలో పనిచేసే సిబ్బంది శుభ్రతపట్ల ఎటువంటి ఆరోపణలు లేవు. లడ్డు ప్రసాదంలో ఇనుపమేకులు రావడం, జనపనారా పీచులు రావడం జరుగుతుంది.
భక్తులు వాటిని పత్రికలవారికి చూపించడం, ప్రసాదంలో మేకులు రావడం సర్వసామాన్యమైంది. ఇటువంటి వార్తలు ఎన్ని వస్తున్నప్పటికీ లడ్డు తయారీ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్న దాఖలాలేదు. దేవస్థానం అధికారులు గ్లౌజులు, తోపీలతోపాటు ప్రసాదంలో మేకులు, పీచులు రాకుండా చూడటం కూడా అవసరమని భక్తులు అభిప్రాయపడుతున్నారు


