TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హెలికాప్టర్ ప్రమాదంలో ప్రముఖ పాప్ సింగర్ ఒలివర్ ట్రీ దుర్మరణం

Published on: Mon Jun 15, 2026 8:32AM

ఆకాశంలో రెండు హెలికాప్టర్లు ఢీకొని ఆరుగురుర దుర్మరణం పాలైన ఘోర విషాదం బ్రెజిల్ లోని  రియో డి జనీరోలో  జరిగింది. ఈ ఘోర ప్రమాద మృతులలో  ప్రముఖ పాప్ సింగర్ ఇలివర్ ట్రీ  కూడా ఉన్నారు. నిన్న ఉదయం రెక్రియో డోస్ బాందీరాంటెస్ వద్ద ఈ ఘోర దుర్ఘటన జరిగింది.  
 వివరాలిలా ఉన్నాయి. రెండు హెలికాప్టర్లు గాల్లోనే ఢీకొని ముక్కలయ్యాయి. ఈ శకలాలు సమీపంలోని చైనాకు చెందిన బీవైడీ ఎలక్ట్రిక్ కారు పార్కింగ్ యార్డులో పడి అక్కడ ;పార్క్ చేసి ఉంచిన 20 లగ్జరీ కార్లు  దగ్ధమయ్యాయి. ఎలక్ట్రిక్ కార్లలోని లిథియం-అయాన్ బ్యాటరీల కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. 

ఈ ప్రమాదంలో మ్యూజిక్ వీడియో షూటింగ్ కోసం బ్రెజిల్ వచ్చిన అమెరికన్ సింగర్, కమెడియన్ ఒలివర్ ట్రీ  మరణించాడు. ఆయనతో పాటు అర్జెంటీనాకు చెందిన ప్రముఖ యూట్యూబర్    గాస్పి , దర్శకుడు లూకాస్ విగ్నాల్, మ్యూజిక్ ప్రొడ్యూసర్ లూకాస్ బ్రిటో చావెస్, ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు.  లైఫ్ గోస్ ఆన్,  మిస్ యూ' వంటి పాటలతో ఒలివర్ ట్రీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు.  

ఒలివర్ ట్రీ ఆకస్మిక మరణంతో సంగీత ప్రపంచం, ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనపై బ్రెజిల్ ఏవియేషన్ అథారిటీ, స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమికంగా పైలట్ల తప్పిదం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో కాకుండా పార్కింగ్ యార్డులో శకలాలు పడటంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.