TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆధార్ తరహాలో ఏపీలో ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్!

Published on: Fri Aug 29, 2025 10:45AM

ఆంధ్రప్రదేశ్ లో  కుటుంబాలన్నిటికీ ఫ్యమిలీ బెనిఫిట్ కార్డు అందించే కార్యక్రమానికి చంద్రబాబు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆధార్ కార్డ్ తరహాలో ఈ కార్డు రాష్ట్ర పథకాల ప్రయోజనాలన్నిటికీ ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ఇడింటిఫికేషన్ కింద ఉపయోగపడుతుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఒక్కొక్క కుటుంబానికి అందుతున్న పథకాలు సహా  సమస్త వివరాలూ ఫ్యామిలీ కార్డులోనే నమోదు చేయాలని చంద్రబాబు ఆదేశించారు.  

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలకు మేలు చేసేందుకు కట్టుబడి ఉందనీ, అందులో భాగంగానే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డును తీసుకురానున్నట్లు చంద్రబాబు చెప్పారు.  ఫ్యామిలీ బెనిఫిట్‌ మానిటరింగ్‌ వ్యవస్థపై గురువారం (ఆగస్టు 28) సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ఆ సందర్భంగానే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు  నిర్ణయం తీసుకున్నారు.

ఆధార్ తరహాలోనే ఈ ఫ్యామిలీ కార్డులో ఆ కుటుంబానికి సంబంధించిన మొత్త సమాచారం అందు బాటులో ఉంటుందన్నారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలు సహా పూర్తి వివరాలను  ఫ్యామిలీ కార్డులో పొందుపరిచి, వివరాలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ ఉండాలని అధికారులను ఆదేశించారు.  ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాల కోసం కుటుం బాలు విడిపోయే పరిస్థితి రాకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్న చంద్రబాబు, అందుకు అనుగుణంగా అందరికీ లబ్ధి చేకూర్చేలా పథకాలను రీడిజైన్‌ చేసే విషయాన్ని పరిశీలించలని చంద్ర బాబు పేర్కొన్నారు.