నిజమే... ఎల్లంగౌడ్ లొంగిపోయాడు...
Published on: Wed Aug 20, 2014 6:49AM
.jpg)
నకిలీ నోట్ల చెలామణీ ముఠా నాయకుడు, హైదరాబాద్ శివార్లలో ఒక కానిస్టేబుల్‌ని కాల్చిచంపిన ఎల్లంగౌడ్‌ని అరెస్టు చేశామని పోలీసులు ప్రకటించారు. అయితే ఎల్లంగౌడ్‌ని అరెస్టు చేయడంలో పోలీసుల ప్రతాపం ఏమీ లేదని, ఎల్లంగౌడ్ తానే లొంగిపోయాడని తెలుస్తోంది. ఎల్లంగౌడ్ హైదరాబాద్ శివార్లలో కానిస్టేబుల్‌ని కాల్చి చంపిన తర్వాత అతగాడిని పట్టుకోవడానికి ఆరు పోలీసు బృందాలు ఏర్పాటయ్యాయి. ఈ బృందాలేవీ ఎల్లంగౌడ్‌ని పట్టుకోవడంతో ప్రగతి సాధించలేదని తెలుస్తోంది. చివరికి ఒఖ రాజకీయ నాయకుడి ద్వారా ఎల్లంగౌడ్ స్వయంగా లొంగిపోయినట్టు తెలుస్తోంది. మొదట ఎల్లంగౌడ్‌ని తామే అరెస్టు చేశామని ప్రకటించుకున్న పోలీసులు ఆ తర్వాత ఎల్లంగౌడ్ లొంగిపోయాడని తెలిపారు.


