పేట్రేగిపోయిన దొంగనోట్ల ముఠా: ఇద్దరి మృతి
Published on: Sat Aug 2, 2014 9:23AM

హైదరాబాద్ నగర శివార్లలో పోలీసులకు, దొంగనోట్ల ముఠాకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఒక పోలీసు కానిస్టేబుల్ మరణించగా, దొంగనోట్ల ముఠాకు చెందిన ఒక సభ్యులు చనిపోయాడు. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండలం మజీద్‌పూర్ దగ్గర ఒక దొంగనోట్ల ముఠా వుందని తెలుసుకున్న పోలీసులు అక్కడకి వెళ్ళారు. అక్కడ ఓ వాహనంలో వున్న నలుగురు సభ్యుల ముఠా పోలీసులను చూడగానే కత్తులతో, తుపాకులతో దాడి చేసింది. ముఠా జరిపిన కాల్పుల్లో ఈశ్వరయ్య అనే కానిస్టేబుల్ మరణించాడు. అలాగే వెంకట్‌రెడ్డి అనే ఎస్‌ఐకి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఆత్మరక్షణ కోసం జరిపిన ఎదురు కాల్పుల్లో ముఠాలోని గుర్తుతెలియని వ్యక్తి మరణించాడు. ముఠాలోని మిగతా ముగ్గురు తమ వాహనంలో పరారయ్యారు.


