నకిలీ కరెన్సీ ముఠా దొరికింది
Published on: Sat Aug 2, 2014 11:23AM

హైదరాబాద్ నగర శివార్లలో పోలీసులకు, దొంగనోట్ల ముఠాకు మధ్య కాల్పులు జరిగిన సంఘటనలో ఒక పోలీసు కానిస్టేబుల్ మరణించగా, దొంగనోట్ల ముఠాకు చెందిన ఒక సభ్యుడు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ నకిలీ నోట్ల ముఠాలోని ముగ్గురు వ్యక్తులు తమ వాహనంలో పారిపోయారు. వీరిని పట్టుకోవడానికి నాలుగు పోలీసు టీమ్‌లు రంగంలోకి దిగి ముఠాలోని ఇద్దరు సభ్యులను పట్టుకుంది. పోలీసు కాల్పుల్లో చనిపోయిన వ్యక్తి మెదక్ జిల్లా సిద్దిపేటకు చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండలం మజీద్‌పూర్ దగ్గర ఒక దొంగనోట్ల ముఠా వుందని తెలుసుకున్న పోలీసులు అక్కడ దొంగనోట్ల ముఠా జరిపిన కాల్పుల్లో ఈశ్వరయ్య అనే కానిస్టేబుల్ మరణించాడు. వెంకట్‌రెడ్డి అనే ఎస్‌ఐకి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.


