ఎస్పీ బాలు మృతికి రామోజీరావుకు ముడిపెడుతూ చిల్లర రాతలు

సోషల్ మీడియా వేదికగా కొందరు సన్నాసులు రెచ్చిపోతున్నారు. అసత్యాలు ప్రచారం చేస్తూ పైశాచికానందం పొందుతున్నారు. చీప్ పబ్లిసిటి కోసం, సొంత ప్రయోజనాల కోసం ప్రముఖులను బద్నాం చేస్తున్నారు. ఏపీలో కొన్ని వర్గాలే టార్గెట్ గా ఈ కుట్రలు చేస్తున్నారు. కావాలని బురద చల్లుతూ సిగ్గు లేని వెధవలు సంతోష పడుతున్నారు. అనారోగ్యంతో చనిపోయిన గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రమణ్యం మరణంపైనా పిచ్చోళ్లలా పిచ్చి రాతలు రాస్తున్నారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుపై బురద చల్లుతూ వికృత చేష్టలకు దిగారు బుద్ది, జ్ఞానం లేని చిల్లరగాళ్లు. ఎస్పీ బాలు చావుకు రామోజీరావుకు ముడిపెడుతూ చిల్లర రాతలకు దిగారు. రామోజీ రావు బలవంతం మీదే ఈటీవీ ప్రోగ్రామ్ లో పాల్గొనేందుకు చెన్నై నుంచి బాలసుబ్రమణ్యం హైదారాబాద్ వచ్చారని.. రామోజీ ఫిల్మ్ సిటీకి రావడంతోనే బాలుకి కరోనా సోకిందని  ప్రచారం చేస్తున్నారు. ఈటీవీ ఈవెంట్ లో పాల్గొన్న చాలా మంది కళాకారులకు కరోనా సోకిందని.. బాలు తప్ప అందరూ కోలుకున్నారని ఫేస్ బుక్ పేజీల్లో, వెబ్ సైట్లలో ఇష్టమెచ్చినట్లుగా రాసుకొచ్చారు. రామోజీ ఫిల్మ్  సిటీకి వెళ్లడం వల్లే బాలు చావు తెచ్చుకొన్నాడని, ఈ పాపం రామోజీ రావుదే నంటూ పైశాచికత్వం ప్రదర్శించారు. 

 

అయితే సోషల్ మీడియాలో సన్నాసులు  ప్రచారం చేస్తున్నదంతా పచ్చి బూటకమని తేలిపోయింది. ఇటీవల కాలంలో రామోజీ ఫిల్మ్ స్టూడియోలో ఈటీవీ ప్రోగ్రామ్స్ ఏమి జరగలేదు. కరోనా సమయంలో ఈటీవికి సంబంధించి ఎలాంటి ఈవెంట్లు జరగలేదు. ఎస్పీ బాల సుబ్రమణ్యం పాల్గొన్నది ఈటీవీ ప్రోగ్రామ్ కానే కాదు. జూలై 18న హైదరాబాద్ వచ్చిన ఎస్పీ బాలు, చరణ్ లు మౌనరాగం మురళీ 100వ ఎల్పీ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి ఈటీవికి  ఎలాంటి సంబంధం లేదు. కాని ఈ విషయంపై కావాలనే కుట్రపూరితంగా రాతలు రాస్తున్నారు కొందరు వెధవలు. ఈటీవీ ప్రోగ్రామ్ లో పాల్గొనేందుకు రామోజీరావు బలవంతం మీద.. బాల సుబ్రమణ్యం హైదరాబాద్ వచ్చారని  కొందరు సన్నాసులు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారు. 

 

ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు ఎస్పీ బాల సుబ్రమణ్యం మీద ఎంతో అప్యాయత చూపేవారు. పాడుతా తీయగా కార్యక్రమంటే రామోజీ రావుకు అత్యంత ఇష్టం. అందుకే ఎస్పీ బాలుతో నిర్వహించేవారు. బాలూనే ఈ విషయాన్ని చాలా వేదికలపై చెప్పారు. రామోజీరావు తనకెంతో ఇచ్చారని, తానే ఆయనేమి ఇవ్వలేదని చెప్పుకునేవారు. పాడుతా తీయగా కార్యక్రమంతో తన గౌరవం మరింత పెరిగిందని తెలిపేవారు బాలు. ఈ కార్యక్రమంతో తన పేరు కూడా ఎస్పీ బాలు కాకుండా పాడుతా తీయగా బాలుగా మారిందని చెబుతూ నవ్వుకునేవారు. అంతేకాదు ఓ ఈవెంట్ లో వేదికపైనే రామోజీ రావుకి సాష్టాంగ నమస్కారం చేశారు బాలసుబ్రమణ్యం. రామోజీ కూడా బాలును ఎంతో అప్యాయతతో ఆలింగనం చేసుకుని ఆయన పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అందుకే ఎప్పుడు మీడియా ముందుకు రాని రామోజీ రావు.. బాలు మరణంపై మాత్రం మీడియా ముందుకు వచ్చి తమ సంతాపం తెలిపారు. తన జీవిత కాలంలో రామోజీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం ఇది కేవలం రెండోసారి మాత్రమే. మార్గదర్శి మీద అప్పటి వైఎస్సార్ సర్కార్ కుట్ర పూర్వక కేసు పెట్టినపుడు తమ ఖాతాదారులకు భరోసా కల్పించడానికి మెుదటి సారి రామోజీ మీడియా ముందుకు వచ్చారు. ఆయన చిన్న కొడుకు చనిపోయినపుడు కూడా మీడియా ముందుకు రాలేదు రామోజీ రావు. దీన్ని బట్టే చెప్పవచ్చు రామోజీకి, ఎస్పీ బాలు మీద ఉన్న గౌరవం, వారి మధ్య ఉన్న స్నేహం, ప్రేమ. 

 

రామోజీ, ఎస్పీ బాలు మధ్య మంచి అనురాగ బంధాలుండగా.. కొందరు దుర్మార్గలు చావులోనూ చిల్లర చేష్టలకు దిగడం తెలుగు ప్రజలను విస్మయపరుస్తోంది. అయితే రామోజీరావుపై అసత్య ప్రచారం వెనుక పెద్ద కుట్రే ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వంలోని కొందరు పెద్దల డైరెక్షన్ లోనే ఇదంతా జరుగుతుందని సమాచారం. ఏపీలో కొంత కాలంగా కమ్మ నేతలు, కమ్మ వ్యాపారులు, కమ్మ సామాజిక వర్గంలోని ప్రముఖుల టార్గెట్ అయ్యారు. ఆ వర్గం వారిపైనే కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల ఆలయాలపైనా దాడులు జరుగుతున్నాయి. రోజూ ఏదో ఒక చోట ఆలయంపై దాడి జరుగుతూనే ఉంది. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. దీంతో ప్రజల దృష్టిని ఈ అంశంపై నుంచి మరల్చడానికే ఇలాంటి కుట్రలకు తెరలేపారని తెలుస్తోంది. బ్రహ్మణ, కమ్మ వర్గాల మధ్య చిచ్చు పెట్టాలన్నదే  చిల్లర కుట్రదారుల పన్నాగమని సమాచారం. ఎస్పీ బాలు బ్రహ్మణుడు కావడంతో అతని చావుకు రామోజీ రావు కారణమనే చిల్లర రాతలకు దిగారు. తమ ప్రచారంతో బ్రహ్మణులంతా కమ్మ వర్గాన్ని టార్గెట్ చేయాలన్నది వారి ప్లాన్ లో భాగమని భావిస్తున్నారు.

 

ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణాన్ని రామోజీ రావుకు అంటగడుతూ చేస్తున్న ప్రచారంపై ప్రజలు భగ్గుమంటున్నారు. ప్రచారం కోసం ఇంతగా దిగజారడమేంటని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రముఖులపై చిల్లర ప్రచారం చేసే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరగవచ్చనే ఆందోళన జనాల్లో వ్యక్తమవుతోంది.