లైట్లు ఆపేస్తే, గ్రిడ్ కూలిపోతుందని గడుగ్గాయిల తప్పుడు ప్రచారం 

* డొమెస్టిక్ లైటింగే కాదు, గ్రిడ్ చాలా అవసరాలు తీరుస్తుందని జెన్కో అధికారుల స్పష్టీకరణ 
* ప్రధాని 9 నిమిషాల జ్యోతి ప్రజ్వలన ప్రతిపాదనను ఎడ్వాంటేజ్ తీసుకున్న సోషల్ మీడియాఫేక్ వీరులు 

ఎద్దు ఈనిందంటే, దూడను కట్టేయమన్నాట్ట వెనుకటికో పరమానందయ్య శిష్యుడు. అలానే ఉంది, ప్రధాని ఏదో జనాల్లో సమైక్య భావన నింపేందుకు 9 నిమిషాలపాటు లైట్లు ఆపేయాలని పిలుపునిస్తే, ఆ పని చేయబాకండి .... గ్రిడ్ కూలిపోతుందంటూ కొందరు సోషల్ మీడియా ఫేక్ వీరులు, విస్తారంగా తప్పుడు సమాచారం చేరవేస్తున్నారు. అయితే, ఆ ప్రచారం ఫేక్ అంటూ జెన్కో ఇంజనీర్లు క్లారిటీ ఇచ్చేశారు. ఈ నెల  5 న రాత్రి 9 గంటలకు కొవ్వొత్తులు, దీపాలను వెలిగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు తో, విద్యుద్దీపాలు ఆపివేస్తే, గ్రిడ్ ఫెయిల్ అవుతుందంటూ విద్యుత్ శాఖ ఇంజనీర్ల పేరిట సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న వీడియో లో వాస్తవం లేదని  సీనియర్ ఇంజనీరు స్పష్టం చేశారు. ఆ ఫేక్ ప్రకటన ప్రజలను, ప్రభుత్వాలను పక్కదోవ పట్టించే విధంగా ఉందని సీనియర్ ఇంజనీర్లు అంటున్నారు. " 5 వ తేదీ రాత్రి 9 గంటల కు ఇలా చేస్తున్నప్పుడు, లైట్లు ఆపివేయమని ప్రధాని  మాకు సూచించారు.

కానీ, ఇప్పటికే, అన్ని పారిశ్రామిక మరియు వాణిజ్య లోడ్లు ఆఫ్‌లో ఉన్నందున, మాకు గ్రిడ్‌లో దేశీయ లోడ్లు మరియు అవసరమైన సేవల లోడ్లు మాత్రమే ఉన్నాయి. (ప్రస్తుత) లైటింగ్ లోడ్ మొత్తం లోడ్ కంటే 40% కన్నా తక్కువ కాబట్టి, గ్రిడ్‌లోని అన్ని లైట్ల ఆకస్మిక (ఏకకాలంలో) స్విచ్-ఆఫ్ చేయడం విద్యుత్తు కుప్పకూలిపోవచ్చు (భారీ లోడ్ అకస్మాత్తుగా పడిపోవడం).  కాబట్టి, దయచేసి, ఫ్రిజ్‌లు,ఫ్యాన్స్ మరియు ఎసిలు వంటి కొన్ని లోడ్‌లను ఆన్‌లో ఉంచమని ప్రజలకు సలహా ఇవ్వండి.  గ్రిడ్ కూలిపోతే, రోగులకు చికిత్స చేస్తున్న అన్ని ఆసుపత్రులు వారి క్లిష్టమైన విద్యుత్ సరఫరాను కోల్పోవచ్చు.  గ్రిడ్‌ను సేవ్ చేయడానికి దయచేసి దీన్ని అందరికీ ఫార్వార్డ్ చేయండి," అంటూ విద్యుత్ ఉద్యోగుల పేరిట ఒక ప్రకటన సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. అయితే, ఇందులో వాస్తవం లేదని ఆంధ్ర ప్రదేశ్ జెన్కో కు చెందిన సీనియర్లు స్పష్టం చేస్తున్నారు.

చాలా మంది తమ ఇళ్లల్లో -ఎల్ ఈ డీ బల్బులు వాడుతున్నారు, వాటి వల్ల విద్యుత్ వినియోగం ఎలాగు తక్కువే ఉంటుందని వారు వివరిస్తున్నారు. డొమెస్టిక్ లైటింగ్ స్విచ్ ఆఫ్ చేయటం ఒక్కదాని వల్లనే, గ్రిడ్ కుప్ప కూలుతుందని వస్తున్న ప్రచారం లో వాస్తవం లేదని కూడా సీనియర్ ఇంజనీర్లు స్పష్టం చేస్తున్నారు. " డొమెస్టిక్ లైటింగ్ లోడ్ కే కాకుండా, ఇతరత్రా చాలా లోడ్స్ కు కూడా గ్రిడ్ ఫీడ్ చేస్తూ ఉంటుందనీ, లోడ్ బ్యాలెన్సింగ్, జెనెరేషన్ అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయటానికి ఎప్పుడూ టీమ్స్ సన్నద్ధం గానే ఉన్నాయనీ, అందువల్ల గ్రిడ్ కూలిపోతుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని కూడా జెన్కో ఇంజనీర్లు స్పష్టం చేస్తున్నారు. షబ్ స్టేషన్ స్థాయిలోనే అడ్రెస్ చేయగల అంశాలను భూతద్దంలో చూసి, ప్రధాని ప్రతిపాదించిన 9 నిమిషాల కార్యక్రమం పై లేనిపోని అపోహలు సృష్టించవద్దని కూడా సీనియర్ ఇంజనీర్లు విజ్ఞపి చేశారు.