TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బంగారు లక్ష్మణ్కు నాలుగేళ్లు జైలు శిక్ష,లక్ష జరిమానా

Published on: Sat Apr 28, 2012 3:58PM

ఆయుధ డీలరు నుంచి లక్ష రూపాయల లంచం తీసుకున్న కేసులో బీజేపీ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్‌కు ఢిల్లీ కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. లక్ష్మణ్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధించాలని సిబిఐ కోరింది. అయితే, తన అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని శిక్షను తగ్గించాలని బంగారు లక్ష్మణ్ కోర్టును కోరారు. దీంతో 72 ఏళ్ల బంగారు లక్ష్మణ్‌కు కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించడమే కాకుండా లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది. లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ తెహెల్కా స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిన బంగారు లక్ష్మణ్‌ను కోర్టు శుక్రవారం దోషిగా నిర్దారించింది. ఆయనకు శనివారం కోర్టు శిక్షను ఖరారు చేసింది.