ఫెయిలైన విద్యార్ధులకు దరఖాస్తు అవసరంలేదు

 

తెలంగాణ ఇంటర్ ఫలితాల వివాదంపై నిన్న సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించి.. ఫెయిల్ అయిన విద్యార్ధులకు ఉచితంగా రీవెరిఫికేషన్ చేయాలని అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిల్ అయిన విద్యార్ధులు రీవెరిఫికేషన్ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రకటించింది. ఫెయిల్ అయిన విద్యార్ధులకు మే15లోగా కొత్త మెమోలు అందచేస్తామని తెలిపింది. ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయి ఇప్పటికే రీవెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకున్న వారికి డబ్బులు తిరిగి చెల్లిస్తామని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.