TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

న్యూసెన్స్ ఆఫ్ ఇండియా..!?

Published on: Fri Feb 18, 2022 11:23AM

మోహ‌న్‌బాబు సీరియ‌స్ అయ్యారు. ఆయ‌న‌పై సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ట్రోలింగ్‌పై మండిప‌డ్డారు. జ‌గ‌న్‌తో భేటీకి త‌న‌ను అడ్డుకున్నారంటూ.. ఇండ‌స్ట్రీలో రాజ‌కీయాలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. మోహ‌న్‌బాబు, విష్ణు.. వ‌రుస‌బెట్టి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తుండ‌టం టాలీవుడ్‌లో కాక రేపుతోంది. ఇంత‌కీ, ఎవ‌రు ఎవ‌రిని టార్గెట్ చేస్తున్నారు?  మోహ‌న్‌బాబు చుట్టూ రాజ‌కీయం జ‌రుగుతోందా? అది మెగా మెడ‌కు చుట్టుకుంటోంది? ఇందులో వైసీపీ స్కెచ్ కూడా ఉందా? అనే ప్ర‌శ్న‌లు.. అంత‌కు మించి అనుమానాలు. 

స‌న్ ఆఫ్ ఇండియా సినిమాకు థియేట‌ర్ల‌లో సీట్లు ఖాళీగా ఉన్న స్క్రీన్ షాట్ల‌తో పెద్ద ఎత్తున ట్రోల్ న‌డిచింది. స‌న్ ఆఫ్ ఇండియా సినిమాకు థియేట‌ర్ల‌లో సీట్లు ఖాళీగా ఉన్న స్క్రీన్ షాట్ల‌తో పెద్ద ఎత్తున ట్రోల్ న‌డిచింది. ఇక సినిమా టాక్, రివ్యూల గురించైతే చెబితే చెవులు మూసుకోవాల్సిందే. దారుణంగా ట్రోల్స్ నడుస్తున్నాయి. ఇప్పుడే అని కాదు.. ఇటీవ‌ల కాలంలో మోహ‌న్‌బాబు ట్రోల‌ర్స్‌కు ఫేవ‌రేట్‌గా మారారు. 'మా' ఎన్నిక‌ల్లో మంచు విష్ణు పోటీకి దిగ‌న‌ప్ప‌టి నుంచీ ఆ ఫ్యామిలీ సోష‌ల్ మీడియాలో టార్గెట్ అయింది. మోహ‌న్‌బాబునే కాదు.. మంచు విష్ణు, మంచు ల‌క్ష్మిల‌నూ ట్రోల్స్‌తో, మీమ్స్‌తో ఆటాడుకున్నారు నెటిజ‌న్లు. అవ‌న్నీ చూసే.. లేటెస్ట్‌గా మోహ‌న్‌బాబు బ‌ర‌స్ట్ అయ్యారు. ఇద్దరు హీరోలు కావాలనే తనపైనా, తన కుటుంబంపైనా ట్రోలింగ్ చేయిస్తున్నారని చెప్పారు. యాభై నుంచి వంద మందిని ప్రత్యేకంగా నియ‌మించుకుని మరీ నన్ను ట్రోల్ చేయిస్తున్నారు. వాళ్లెవ‌రో కూడా తెలుసు. ఏదో ఒక రోజు వారు శిక్ష అనుభ‌విస్తారని కాస్త సీరియ‌స్ టోన్‌లో వార్నింగ్ ఇచ్చారు. ఇంత‌కీ, మోహ‌న్‌బాబు అనుమానిస్తున్న ఆ ఇద్ద‌రు హీరోలు ఎవ‌రు?  వాళ్లు వాళ్లిద్ద‌రేనా? అంటూ చ‌ర్చ‌..ర‌చ్చ మొద‌లైంది.  

ఫ‌స్ట్ అంద‌రిచూపులు చిరంజీవి వైపే మ‌ళ్లాయి. మా ఎల‌క్ష‌న్స్ టైమ్ నుంచీ మంచు, మెగా వ‌ర్గాల మ‌ధ్య కోల్డ్‌వార్ న‌డుస్తోంది. అప్ప‌టి నుంచే మంచు ఫ్యామిలీపై ఈ ట్రోలింగ్ మొద‌లైంది. విష్ణు చేతిలో మెగా ఫ్యామిలీ బ‌ల‌ప‌రిచిన ప్ర‌కాశ్‌రాజ్ ఓడిపోవ‌డంతో ఆ అస‌హ‌నంతో మ‌రింత డోసు పెరిగింది. ఇక‌, చిరంజీవి తాడేప‌ల్లి ప్యాలెస్‌కు వెళ్లి జ‌గ‌న్‌రెడ్డితో భేటీ కావ‌డం.. టికెట్ల ఇష్యూలో మొద‌ట్లో మంచు ఫ్యామిలీకి ఎలాంటి ప్రాధాన్యం ద‌క్క‌క‌పోవ‌డంతో.. ఈసారి మంచు వ‌ర్గీయుల్లో అసంతృప్తి స్టార్ట్ అయింది. ఇక జ‌గ‌న్‌తో బంధుత్వం.. భుజాన‌ వైసీపీ కండువా ఉండ‌టం మ‌రో కార‌ణం. దీంతో, చిరు టార్గెట్‌గానూ ట్రోల్స్ వ‌చ్చాయి. ఇక‌, లేటెస్ట్‌గా త‌న‌పై ఓ ఇద్ద‌రు హీరోలు ప్ర‌త్యేకంగా సిబ్బందిని పెట్టుకుని మ‌రీ ట్రోల్స్ చేయిస్తున్నారంటూ మోహ‌న్‌బాబు ఆరోపించ‌డం ఆస‌క్తిక‌రం. అంత‌టితో ఆగ‌కుండా.. త‌న‌ను సీఎం జ‌గ‌న్‌తో భేటీకి పిల‌వ‌కుండా కొంద‌రు రాజ‌కీయ చేశారంటూ మరింత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

మోహ‌న్‌బాబు అనే కాదు.. ఇటీవ‌ల మంచు విష్ణు సైతం ఇలాంటి వ్యాఖ్య‌లే చేశారు. ప్ర‌భుత్వం నుంచి త‌మ‌కు ఆహ్వానం అంద‌కుండా కొంద‌రు అడ్డుకున్నార‌ని ఆరోప‌ణ‌లు చేశారు. అప్పుడు సైతం ఆ అడ్డుకున్న‌ది చిరంజీవేనంటూ ప్ర‌చారం జ‌రిగింది. ఇప్పుడు మోహ‌న్‌బాబు కామెంట్స్‌తో మ‌రోసారి మెగాస్టార్ వైపే వెళ్ల‌న్నీ చూపిస్తున్నాయి. ఇక చిరుతో పాటు మోహ‌న్‌బాబును ట్రోల్ చేయిస్తున్న‌ ఇంకో హీరో ఎవ‌రై ఉంటార‌నే చ‌ర్చ కూడా న‌డుస్తోంది. ప‌వ‌న్ క‌ల్యాణా? లేక‌, చిరు ఫ్రెండ్ నాగార్జుననా? అనే అనుమానాలు కొంద‌రికి. 

ఇదంతా జ‌స్ట్ ఊహాగానాలే. కాస్త ప‌ద్ద‌తిగా ఆలోచిస్తే ఆ ట్రోల్స్ చేసేది ఎవ‌ర‌నే దానిపై కాస్త క్లారిటీ వ‌స్తుంది. లేటెస్ట్‌గా రిలీజ్ అయిన.. మోహ‌న్‌బాబు లీడ్ రోల్‌లో న‌టించిన‌.. స‌న్ ఆఫ్ ఇండియా మూవీకి చిరంజీవి వాయిస్ ఓవ‌ర్ ఇచ్చారు. వ‌రుస సినిమాలు, టికెట్ల ఇష్యూతో ఫుల్ బిజీగా ఉన్న‌ మెగాస్టార్.. నిజానికి స‌న్ ఆఫ్ ఇండియా సినిమాకు వాయిస్ ఇవ్వాల్సిన అవ‌స‌ర‌మే లేదు. కానీ, మోహ‌న్‌బాబు కోస‌మే ఆయ‌న ఆ ప‌ని చేశారనేది వాస్త‌వం. వారిద్ద‌రి మ‌ధ్య మ‌రీ అంత బ్యాడ్ రిలేష‌న్‌షిప్ ఏమీ లేదంటున్నారు. చిరంజీవి లాంటి హుందా మ‌నిషి.. ట్రోల్స్ చేయించేటంత‌టి చీప్ ట్రిక్స్‌కు దిగ‌జారే ఛాన్సే లేదు. అందులోనూ, 50-100 మంది స్టాఫ్‌ను పెట్టుకొని మోహ‌న్‌బాబు ఇమేజ్‌ను బ్యాడ్ చేయించే అవ‌కాశం అస‌లేమాత్రం లేదు. చిరు ఆ టైప్ కానే కాద‌ని ఇండ‌స్ట్రీలో అంద‌రికీ తెలుసు. ఇక‌, జ‌గ‌న్‌తో మీటింగ్‌కు రాకుండా మోహ‌న్‌బాబును అడ్డుకున్న‌ది చిరంజీవినే అంటున్నారు. ఇండ‌స్ట్రీకి పెద్ద‌గా నిల‌వాల‌నే భావ‌న‌తోనే.. చిరు త‌న‌కు అనుకూలంగా ఉండే టీమ్‌ను మాత్ర‌మే త‌న‌తో తీసుకెళ్లార‌నే విమ‌ర్శ ఉంది. మంచును అడ్డుకున్న‌ది చిరునే అయ్యుంటార‌నే టాక్ అయితే ఉంది.

ఇక‌, మోహ‌న్‌బాబుపై ట్రోల్స్ చేయిస్తున్న‌ది ప‌వ‌న్ క‌ల్యాణ్ కానే కాక‌పోవ‌చ్చు. పీకే ఐతే ఏదైనా ఉంటే ముఖం మీద‌నే అడిగేస్తారు..క‌డిగేస్తారు కానీ, ఇలా ట్రోల్స్ చేయించేటంత పిరికివాడు కాదు.. ఫైర్ ఉన్నోడు జ‌న‌సేనాని. ఇక‌, నాగార్జున ఇలాంటి విష‌యాల్లో అస‌లేమాత్రం జోక్యం చేసుకోరు. ఆయ‌న సినిమాలు, షోలు, స్టూడియో.. ఆయ‌న ప‌నేదో ఆయ‌న‌ది. సో, నాగ్ అయ్యే ఛాన్స్ కూడా లేనే లేదు. మ‌రి, ఎవ‌రై ఉంటారు?  మోహ‌న్‌బాబు అన్న‌ట్టు ఆ ట్రోల్స్ చేయిస్తున్న ఇద్ద‌రు హీరోలు ఇంకెవ‌రు?

చిరంజీవిని కాద‌ని మిగ‌తా మెగా హీరోలెవ‌రూ ఆయ‌న‌కు తెలీకుండా ఇలాంటి చీప్ ప‌నులు చేయ‌రు. ఇక‌, నాన్ మెగా హీరోస్‌కు అంతటి అవ‌స‌ర‌మే లేదు. సో.. ఇప్పుడున్న టాలీవుడ్ హీరోస్ ఎవ‌రికీ మోహ‌న్‌బాబును ట్రోల్ చేయించేటంత తీరిక‌, అవ‌స‌రం అస్స‌లు లేదు. మ‌రి, మోహ‌న్‌బాబు ఆ వ్యాఖ్య‌లు ఎవ‌రిని ఉద్దేశించి చేసిన‌ట్టు?

ఇక్క‌డే క్లారిటీ మిస్ అవుతోంది. ఆ క్లారిటీ మోహ‌న్‌బాబుకే లేదంటున్నారు. ఆయ‌న అనుకున్న‌ట్టు టాలీవుడ్‌లో ఏ ఇద్ద‌రు హీరోలు కూడా మోహ‌న్‌బాబు మీద ట్రోల్స్ చేయించే ఛాన్స్ లేనేలేదని తెలుస్తోంది. పోలీస్ స్టేష‌న్లో ఓ కంప్లైంట్ ప‌డేస్తే తెలిసిపోతుందిగా. అంత ఇబ్బందిగా ఉంటే.. ఇలా ఇత‌ర హీరోల‌ను బ్లేమ్ చేసే బ‌దులు.. పీఎస్‌లో ఫిర్యాదు చేస్తే పోతుందిగా? అంటూ మోహ‌న్‌బాబుకు ఉచిత స‌ల‌హా ప‌డేస్తున్నారు. మ‌న హీరోలు జెంటిల్‌మెన్ టైప్‌. ట్రోల్స్ లాంటి చిచోరా ప‌నులు, దిగ‌జారుడు పాలిటిక్స్ చేసే టైప్‌ కాదు. ఓ 50-100 మంది ఈ ట్రోల్స్ చేస్తున్న మాట వాస్త‌వ‌మే అయినా.. అలా చేస్తున్న‌దంతా ట్రోల్స్‌తో డ‌బ్బులు సంపాదించుకునే పోరంబోకు బ్యాచ్ మాత్ర‌మే. జ‌స్ట్ ఫ‌న్ కోసం చేసేవారు ఇంకొంద‌రు. త‌మ‌కు తామే ఏదోదో ఊహించుకుని, త‌మ హీరోకు మంచు ఫ్యామిలీతో వైరం ఉంద‌ని భావించి.. కొంద‌రు మెగా ఫ్యాన్స్ సైతం ఈ ప‌ని చేస్తుండ‌వ‌చ్చు. ఇలా, సోష‌ల్ మీడియా అరాచ‌క గ్రూపులే మంచు ఫ్యామిలీ టార్గెట్‌గా ట్రోలింగ్ చేస్తున్నారు కానీ.. మోహ‌న్‌బాబు భావించిన‌ట్టు ఏ ఇద్ద‌రు హీరోలో వంద మందిని నియ‌మించుకుని మ‌రీ.. ఇంకేం ప‌నిలేద‌న్న‌ట్టు మోహ‌న్‌బాబు వెంట ప‌డుండ‌క‌పోవ‌చ్చు. మోహ‌న్‌బాబునే ఎక్క‌డో క్లారిటీ మిస్ అయిన‌ట్టున్నార‌ని అంటున్నారు. లేదంటే.. మొన్న విష్ణు.. నిన్న మోహ‌న్‌బాబు.. ఈ ఇద్ద‌రూ..  కావాల‌నే వైసీపీ డైరెక్ష‌న్‌లో ఆ ఇద్ద‌రు హీరోల‌పై ఇలాంటి వివాదాస్ప‌ద కామెంట్లు చేస్తున్నారా? అనే అనుమాన‌మూ లేక‌పోలేదు.