TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేసీఆర్ చెప్పేదంతా అబ‌ద్ధ‌మా? ఆయన స‌పోర్ట్ చేయ‌లేదా?

Published on: Thu Feb 17, 2022 11:52AM

కేసీఆర్ ఈ మ‌ధ్య కేంద్ర రాజ‌కీయాల‌పై బాగా ఫోక‌స్ పెట్టారు. తెలంగాణ‌లో ప‌రిస్థితి బాగాలేద‌ని గుర్తించారో ఏమో.. ఢిల్లీలో క‌ర్చీఫ్ వేసేందుకు తెగ ట్రై చేస్తున్నారు. వ‌రుస ప్రెస్‌మీట్ల‌తో.. గంట‌ల త‌ర‌బ‌డి ఊద‌ర‌గొడుతున్నారు. మోదీపై, కేంద్రంపై, బీజేపీపై.. ఉద్య‌మ నాయ‌కుడి త‌ర‌హాలో విరుచుకుప‌డుతున్నారు. కేసీఆర్ అంత చేస్తున్నా.. ఇక్క‌డెవ‌రూ ఆయ‌న్ను న‌మ్మే ప‌రిస్థితి లేద‌ని అంటున్నారు. అందుకే, తెలంగాణ‌లో త‌న మాయ‌ల మ‌రాఠీ ట‌క్కు ట‌మారం విద్య‌లు వ‌ర్క‌వుట్ కావ‌ట్లేద‌నుకున్నారో ఏమో.. వేరే రాష్ట్రాల రాజ‌కీయ నేత‌ల‌ను బుట్ట‌లో వేసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. బెంగాల్ దీదీ నుంచి.. త‌మిళ‌నాడు స్టాలిన్ వ‌రకూ.. అంతా త‌న‌వారేనంటూ బ‌ల‌వంతంగా రిలేష‌న్ క‌లిపేసుకుంటున్నారు. కేర‌ళ సీఎం విజ‌య‌న్‌తో భేటీతో కామ్రేడ్ల‌నూ దువ్వుతున్నారు. ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి క‌లిసినా.. ఆయ‌న నుంచి పెద్ద‌గా రియాక్ష‌న్ లేదు. 

ప్ర‌స్తుతం స‌రిహ‌ద్దునే ఉన్న క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర నేత‌ల‌ను బుట్ట‌లో వేసుకునే ప‌నిలో బిజీగా ఉన్నారు కేసీఆర్‌. మ‌హారాష్ట్ర సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే నుంచి త‌న‌కు ఫోన్ వ‌చ్చింద‌ని.. త‌న రాజ‌కీయ ఆలోచ‌న‌ల‌ను ఆయ‌న మెచ్చుకున్నార‌ని.. రేపోమాపో ముంబై వెళ్లి ఠాక్రేను క‌లుస్తాన‌ని కేసీఆర్ చెబుతున్నారు. మ‌మ‌తా బెన‌ర్జీ సైతం త‌న‌ను శెఖాష్ అంద‌ని అంటున్నారు. ప‌నిలో ప‌నిగా మాజీ ప్ర‌ధాని, క‌ర్ణాట‌క జేడీఎస్ అధినేత దేవెగౌడ సైతం త‌న‌కు ఫోన్ చేసి అభినందించారంటూ కేసీఆర్ నుంచి లీకులొచ్చాయి. ఈ వ‌రుస వార్త‌లు చూసి.. తెలంగాణ ప్ర‌జ‌లు అబ్బో.. కేసీఆర్‌ బానే క‌థ న‌డిపిస్తున్నారుగా.. జాతీయ స్థాయిలో పెద్ద నెట్‌వ‌ర్కే ఏర్పాటు చేస్తున్నారుగా.. అనుకోవాల‌నేదే ఆయ‌న వ్యూహంలా క‌నిపిస్తోంది. 

అయితే, లేటెస్ట్‌గా ఓ ఇంట్రెస్టింగ్ మేట‌ర్ వెలుగులోకి వ‌చ్చింది. కేసీఆర్ గురించి తెలిసిందేగా.. లేనిది ఉన్న‌ట్టు చెప్ప‌డంలో ఆయ‌న ఎక్స్‌ప‌ర్ట్‌. దేవెగౌడ విష‌యంలోనూ అలాంటి డ్రామానే న‌డిపించార‌ని తెలుస్తోంది. మాజీ ప్ర‌ధాని దేవెగౌడ.. కేసీఆర్‌కు ఫోన్ చేసి.. మోదీకి వ్య‌తిరేకంగా గులాబీ బాస్ చేస్తున్న రాజ‌కీయ పోరాటాన్ని అభినందించి, ప్రోత్స‌హించారంటూ సీఎంవో నుంచి వ‌చ్చిన వార్త‌లన్నీ అబద్ద‌మ‌ని అంటున్నారు. అస‌లు, దేవెగౌడ కేసీఆర్‌తో ఆ టాపిక్ గురించి మాట్లాడ‌నే లేద‌ని జేడీఎస్ వ‌ర్గాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. క‌ర్ణాట‌క మీడియా ఆ విష‌యంలో ప‌లు వార్తా క‌థ‌నాలు ప్ర‌సారం చేశాయి. ఆ మేర‌కు దేవెగౌడ స‌న్నిహితులు.. త‌మ నేత కేసీఆర్‌ను ఎంక‌రేజ్ చేసిన మాట అవాస్త‌వ‌మంటూ క్లారిటీ ఇచ్చారు. ఇద‌న్న మాట సంగ‌తి. దేవ‌గౌడ కేసీఆర్‌ను స‌పోర్ట్ చేశార‌న‌డం ఉత్తుత్తి ముచ్చ‌టేన‌న్న మాట‌. మరి మిగతా వాళ్ల విషయమైనా నిజమేనా? అనే డౌట్. ఎంతైనా.. కేసీఆర్ కదా నమ్మడం కాస్త కష్టమే. ఇలాంటి పిట్ట‌ల దొర య‌వ్వారాలు చేయ‌డంలో ఆయ‌న త‌ర్వాతే ఎవ‌రైనా..అంటున్నారు.