TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వ్యభిచారం కేసులో వైకాపా నేత బహిష్కరణ 

Published on: Tue Feb 25, 2025 12:00PM

వైకాపా నేత, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు పండిత సోమశంకర్ నాయక్ పై వైకాపా వేటు వేసింది.  విజయవాడలో  వెటర్నీ కాలనీ ఓ స్పా సెంటర్ లో వ్యభిచారం చేసిన కేసులో నాయక్ 10 వ నిందితుడు. గత కొంతకాలంగా ఈ స్పా సెంటర్ లో వ్యభిచారం జరుగుతున్నట్టు పోలీసులకు ఉప్పందింది. మాచవరం పోలీసులు మాటు వేసి స్పా సెంటర్ పై దాడి చేసిన సమయంలో ఓ గదిలో మహిళ మాత్రమే కనిపించింది. అనుమానం వచ్చిన పోలీసులు మంచం క్రింద చూస్తే వైకాపా నేత నక్కినక్కి దాక్కున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ కావడంతో వైకాపా కేంద్ర కమిటి కంటి తుడుపు చర్య తీసుకుంది. సదరు వైకాపా నేతను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. ఓ పక్క వైకాపా నేతలు అందగాళ్లు అని ప్రశంసిస్తుంటే మరో వైపు వైకాపా నేతలు వ్యభిచారం కేసుల్లో నిందితులుగా పోలీస్ రికార్డుల్లోకి ఎక్కుతున్నారు.  ఇటీవల వల్లభనేని వంశీని విజయవాడ సబ్ జైలులో  అధినేత జగన్ పరామర్శించడానికి వచ్చినసంగతి తెలిసిందే.  వివాదాస్పద వైకాపా నేతలైన  వంశీ, కొడాలినాని, అవినాశ్ లను అందగాళ్లు అని  జగన్ సంభోధించిన వారం రోజుల వ్యవధిలో బ్రోతల్ కేసులో వైకాపా నేతలు పట్టుబడడం గమనార్హం.