చైనా ఫ్యాక్టరీలో పేలుడు: 65 మంది మృతి
Published on: Sat Aug 2, 2014 12:58PM
.jpg)
చైనాలోని పరిశ్రమల్లో ప్రమాదాలు జరగడం మామూలైపోయింది. చైనాలోని పరిశ్రమలు విపరీతంగా విస్తరించడం వల్ల ప్రతిరోజూ ఏదో ఒక మూల పరిశ్రమలో ప్రమాదాలు జరుగుతూనే వున్నాయి. తూర్పు చైనాలోని ఒక లోహాల పరిశ్రమలో శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో 65 మంది మరణించారు. 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. షాంగాయ్ నగర సమీపంలోని కున్‌షాన్ నగరంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఒక అమెరికన్ ఆటోమొబైల్ కంపెనీ కోసం కారు విడిభాగాలను తయారు చేస్తున్న సమయంలో పేలుడు జరిగింది. ఈ ఫ్యాక్టరీలో మొత్తం 450 మంది మరణించారు. ప్రమాదం జరిగిన తీరు మొత్తం ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్టు తెలుస్తోంది.


