TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ ను ఆకాశానికెత్తిన గాదె

Published on: Sat Jan 21, 2012 2:27PM

హైదరాబాద్: మాజీ మంత్రి, కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు గాదె వెంకట రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డినీ  మీడియా ప్రతినిధుల సమావేశంలో పొగడ్తలతో ముంచెత్తారు.జగన్‌కు ప్రజల్లో బలం ఉందని ఆయన అన్నారు. పార్టీ పెట్టుకున్నంత మాత్రాన జగన్‌ను ఏమీ అనడానికి లేదని ఆయన అన్నారు.వైయస్ జగన్‌ను ఆయన   జగన్‌కు ప్రజాదరణ ఉందని, జగన్‌కు నాయకత్వ లక్షణాలు లేవనడం సరి కాదని, ఉప ఎన్నికలు జరిగితే గానీ ప్రజల్లో జగన్‌కు ఏ మేరకు ఆదరణ ఉందని తెలియదని ఆయన అన్నారు.  తనకు వైయస్సార్ కాంగ్రెసులోకి పోవాలని లేదని, ఒక వేళ పోవాల్సి వస్తే కారణాలు చెప్తానని ఆయన అన్నారు. జగన్‌కు నాయకత్వ లక్షణాలు ఉన్నాయో లేదో ఉప ఎన్నికలే తేలుస్తాయని ఆయన అన్నారు.కాంగ్రెసు పరిస్థితిని చూస్తే తనకు బాధేస్తోందని ఆయన అన్నారు. అయినా తాను కాంగ్రెసు పార్టీని వీడిపోయేది లేదని, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోనని ఆయన చెప్పారు. తాను ఏ కులానికి వ్యతిరేకం కాదని, ఏ కులాన్నీ తాను ద్వేషించడం లేదని ఆయన అన్నారు. కులాల పేరుతో రాజకీయం చేయడం తప్పు అని ఆయన అన్నారు. తనకు మంత్రి పదవి రాకపోవడంపై గాదె వెంకటరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తాను ఇప్పుడు పార్టీని వీడి బయటకు వెళ్లే స్థితి లేదని, వెళ్లాల్సి వస్తే కారణాలు చెప్తానని, ఆ కారణాలను ప్రతి కాంగ్రెసు నాయకుడు అంగీకరిస్తాడని ఆయన అన్నారు. తాను అంత తొందరగా పార్టీని వీడే వ్యక్తిని కానని ఆయన చెప్పారు.