TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీకి ఎదురు గాలి..

Published on: Mon Mar 7, 2022 5:37PM

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి ఉత్తర ప్రదేశ్ సహా,నాలుగు రాష్ట్రాలలో ఓటమి  ఖారారరైంది. హైదరబాద్ కు చెందిన ‘ఆత్మ సాక్షి’ గ్రూప్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం, ఉత్తర ప్రదేశ్ ‘లో సమాజ్ వాదీ కూటమి, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్’లో కాంగ్రెస్ విజయడంకా మోగించడం ఖాయమని తేలింది.  

ఆత్మ సాక్షి’ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం, ఉత్తర ప్రదేశ్’లో బీజేపీకి 32.5 శాతం ఓట్లు, 138-140 సీట్లు మాత్రమే వస్తాయని, మొత్తం 403 స్తాంలున్న అసెంబ్లీ  సమాజ్ వాదీ కూటమి 39.5 శాతం ఓట్లతో 235-240 స్థానాలతో అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని ఆత్మ సాక్షి’ సర్వే పేర్కొంది. యూపీలో, బీస్పీ 14 శాతం ఓట్లతో 19 నుంచి 23 స్థానాలు, 10 శాతం ఓట్లతో కాంగ్రెస్ పార్టీ 12 నుంచి 16 స్థానాలు గెలుచుకుంటాయని, ఇతరులు 1నుంచి 2 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని  ఆత్మ సాక్షి’ సర్వే పేర్కొంది. 

అలాగే, 117 స్థానాలున్నా పంజాబ్’లో కాంగ్రెస్ పార్టీ 32.5 శాతం ఓట్లతో 58 నుంచి 61 స్థానాలతో అధికారాన్ని నిలుపుకుంటుంది. కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చిన ఆప్’ 29.5 శాతం ఓట్లతో 34 నుంచి 38 స్థానాలతో రెండవ స్థానాన్ని నిలబెట్టుకుంటుంది. కాగా, శిరోమణి అకాలీ దళ్ 25.5 శాతం ఓట్లతో 18 నుంచి 21 స్థానాలు గెలుచుకుని మూడవ స్థానంలో నిలుస్తుంది. బీజేపీ కేవలం 9.5 శాతం  ఓట్లతో 4 నుంచి 5 స్థానాలతో  సరి పెట్టుకుంటే, ఇతరులు 1 నుంచి 2 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని ఆత్మ సాక్షి’సర్వే  తెలిపింది. 

ఇక మొత్తం 70 స్థానాలున్న ఉత్తారరాఖండ్ విషయానికివస్తే, కాంగ్రెస్ 46 శాతం ఓట్లతో 43 నుంచి 47 స్థానాలతో, బీజేపీ నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని  ఆత్మ సాక్షి’ సర్వే పేర్కొంది. బీజేపీ, 40.5 శాతం ఓట్లతో, 20 నుంచి 21 స్థానాలు గెలుచుకుంటుంది . ఉత్తరాఖండ్’లో తొలిసారిగా పోటీలో దిగిన ఆప్ ‘రెండు మూడు స్థానాల్లో ఇతరులు ఒకటి రెండు స్థానాల్లో విషయం సాధిస్తారని సర్వే స్పష్టం చేసింది. 

గోవాలో కాంగ్రెస్ మొత్తం 40 సీట్లకు గానూ కాంగ్రెస్ 45శాతం ఓట్లతో 20-21 స్థానాల్లో విజయం సాధిస్తుంది. బీజేపీ 34 శాతం ఓట్లతో 9 నుంచి 10 స్థానాలకు పరిమితం అవుతుందని సర్వే సూచిస్తోంది. గోవాలోనూ ఆప్ రెండు మూడు స్థానాలతో ఖాతా ఓపెన్ చేస్తోంది. ఇతరులు 5 నుంచి 6 స్థానాల్లో విజయం సాధిస్తారని ఆత్మ సాక్షి ఎగ్జిట్ పోల్ సర్వే సూచిస్తోంది.