వృత్తి పన్ను నుండి గీత కార్మికులకు ఉపశమనం
Published on: Wed Aug 15, 2012 10:47AM
గీత వృత్తి కార్మికుల ప్రధాన డిమాండ్‌గా ఉన్న వృత్తి పన్నును ఎత్తి వేస్తూ ,ప్రభుత్వం వారికి ఊరట కలిగించింది. ఈ మేరకు జి ఓ 512 జారీ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2.62 లక్షల మంది గీత కార్మికులకు ప్రయోజనం కలుగ చేసింది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో మూడు రకాల పన్నులు అంటే చెట్టుపన్ను, గీసిన పన్ను, కల్లు అమ్మిన పన్ను కడుతున్నారు. 2006 కేంద్రప్రభుత్వం కల్లుగీత వృత్తి దారులపై సేవా పన్నును విధిస్తూ నిర్ణయించింది. ఈ విధానం ద్వారా సొసైటీ ఏడాదికి ఒక్కొక్కరికీ 750రూపాయలు పన్నుగా నిర్ణయించారు. అయితే అప్పటినుంచే ఈ పన్ను కార్మికుల నుంచి వసూలు చేయలేక పోయింది. ఈ నేపధ్యంలో కేంద్రప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పన్నునుంచి గీత కార్మికులకు మినహాయింపు నిస్తూ ఆదేశాలిచ్చింది. వైయస్ హయాంలో పన్ను భారం 75 శాతం తగ్గింది. జివొ నెంబరు 555 ప్రకారం కల్లు డిపో లో జిల్లా కేంద్రాలలో నిషేదం పెట్టి 1400దుకాణాలు రద్దు చేశారు. ఆతర్యాత చెట్లు లేని చోట కల్లు దుకాణాలు రద్దు చేశారు. ఈ నేపధ్యంలో వృత్తి పన్ను మినహాయించడం కల్లు గీత కార్మికులకు ఉపశమనం లభించినట్టయ్యింది.


