TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎక్సైజ్ పోస్టులపై తగ్గిన ఆసక్తి

Published on: Tue Apr 24, 2012 10:06AM

నిన్నమొన్నటి వరకూ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో పోస్టింగ్ వస్తుందంటే ఉద్యోగులు ఎగిరిగంతేసేవారు. ఒక్కసారి ఎక్సైజ్ శాఖకు వెళితే చాలు నెలకు లక్షలాది రూపాయలు సంపాదించుకోవచ్చునన ఆశ వారిలో కనిపించేది. దీనికి తోడు బదిలీలు, తమ ప్రమోషన్లకు కూడా ఈ శాఖఉద్యోగులు లక్షలాది రూపాయలు ఖర్చు చేయటానికి వెనుకాడేవారు కాదు. అయితే ఎసిబి దాడుల పుణ్యమా అని పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. బదిలీలు, పోస్టింగుల కోసం పైరవీలు నిలిచిపోయాయి. ఉన్నతాధికారులు తమను ఎక్కడికి బదిలీ చేస్తే అక్కడికి వెళ్ళిపోవటానికి కిందిస్థాయి ఉద్యోగులు సిద్ధపడుతున్నారు. గతంలో డిప్యూటేషన్ పై ఈ శాఖలోకి వచ్చిన ఉద్యోగులు తిరిగి మాతృశాఖలోకి వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నారు. నిజానికి ఎక్సైజ్ శాఖకు సిబ్బంది తక్కువగా ఉన్నప్పటికీ, పనిచేస్తున్న సిబ్బందిపై తీవ్రమైన పనిభారం ఉన్నప్పటికీ డబ్బులు వస్తాయన్న ఆశతో సిబ్బంది ఇబ్బందులను పట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు లంచాలు నిలిచిపోవటంతో వారికి ఈ శాఖపై ఆసక్తి పోయింది. ఇప్పుడు వారు ఏ చిన్న ఇబ్బందిని కూడా తట్టుకోలేకపోతున్నారు. ఏ మాత్రం అవకాశం దొరికినా మాతృశాఖకు వెళ్ళిపోవటానికి ప్రయత్నిస్తున్నారు.