TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నిషావ్యాపారుల ఆస్తుల పత్రాలు, అఫిడవిట్లు పరిశీలన ఇప్పట్లో పూర్తికాదా?

Published on: Sat Aug 25, 2012 8:52AM

నూతన ఎక్సయిజ్‌ పాలసీ కింద మద్యం దుకాణాల లైసెన్సులు మంజూరు చేసి దాదాపు రెండు నెలలవుతోంది. పాత వ్యాపారులతో ఒప్పందాలు కానీ, స్వయంగా కొత్తవారు నడుపు కోవటం కానీ, ప్రారంభమై రెండు నెలలైనా ఎక్సయిజ్‌ శాఖ కొత్తదుకాణదారుల ఆస్తుల పత్రాలను పరిశీలించలేక పోయింది. కల్తీమద్యం విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకోవటం, ఎమ్మార్పీ ధరలకు మద్యం అమ్మకాలు జరిగేలా చూడటం వంటి పలు అంశాలపై శాఖాపరంగా దృష్టిసారించటంతో ఈ పత్రాల పరిశీలనను ప్రభుత్వ సూచనల మేరకు రెవెన్యూశాఖకు అప్పగించారు. రాష్ట్రవ్యాప్తంగా 6,596 మద్యం దుకాణాలకు ధరఖాస్తులు ఆహ్వానిస్తే 5,959 దుకాణాలకు లైసెన్సులు మంజూరు చేశారు. ఒకవేళ వ్యాపారి ఎప్పుడైనా లైసెన్సు ఫీజు చెల్లించకపోతే అఫిడవిట్ల ద్వారా డబ్బు రాబట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో కొందరు వ్యాపారులు నకిలీ పత్రాలు సమర్పించారని వెలుగులోకి వచ్చింది. అందువల్ల శ్రద్ధగా ఈ పత్రాల పరిశీలన చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో రెవెన్యూశాఖ ఇంకా ఈ పత్రాలు ఎంతవరకూ పరిశీలించిందో? వివరాలు వెల్లడిరచలేదు. దీంతో ఆ పరిశీలన ఎప్పటికి పూర్తవుతుందో కూడా అంచనా వేయటమే కష్టంగా ఉంది. ఇంకా ఎంత సమయం కావాల్సి ఉందో కూడా రెవెన్యూశాఖ ఎక్సయిజ్‌కు తెలియజేయలేదు. దీంతో ఈ పరిశీలన ఇప్పట్లో పూర్తయ్యేలా లేదని మాత్రం అర్థమవుతోంది.