ఇక మీదట భారీ లగేజికి భారీ బాదుడు- ఎంతో తెలుసా!
Published on: Wed Jun 6, 2018 11:48AM

రైలు ప్రయాణం అందులోనూ దూర ప్రయాణం పెట్టుకుంటే... వీలైనంత లగేజిని తీసుకువెళ్లడం మన అలవాటు. నిజానికి ఇంత లగేజిని మించి తీసుకువెళ్తే, జరిమానా తప్పదంటూ టికెట్టు మీదే ఉన్నా... ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ ఇక మీదట ఆ అలవాటుని కాస్త అదుపులో ఉండాలని హెచ్చరిస్తోంది ప్రభుత్వం. లిమిట్ దాటిన లగేజి మీద ఆరురెట్లు జరిమానా విధిస్తామని హెచ్చరిస్తోంది. ఉదాహరణకు పరిమితికి మించి ఓ నలభై కిలోల బరువుని తీసుకువెళ్తే... ఏకంగా 600 రూపాయలకు పైగా పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. అంతేకాదండోయ్! ట్రంకుపెట్టెల్లాంటి సామాన్లు కూడా మరీ అంత విశాలంగా లేకుండా చూసుకోవాలి మరి. లేకపోతే లావైపోతారు.


