TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న సందర్భంగా సీఎం రేవంత్‌ను కలిసిన సీపీ సీవీ ఆనంద్

Published on: Sat May 17, 2025 4:23PM

 

ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కొటిక్స్ అవార్డును అందుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మర్యాదపూర్వకంగా కలిశారు. 138 దేశాలతో పోటీపడి ప్రపంచంలోనే తెలంగాణ నంబర్ వన్ గా నిలవడంపై సీవీ ఆనంద్‌ను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. దుబాయ్‌లో జరుగుతున్న వరల్డ్ పోలీస్ సమ్మిట్ 2025లో హైదరాబాద్ పోలీసులు ప్రతిష్టాత్మకమైన అవార్డును కైవసం చేసుకున్నారు. డ్రగ్స్ అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టడంలో విశేష కృషి చేసినందుకు గాను, ఎక్సలెన్స్ ఇన్ యాంటీ-నార్కోటిక్స్ అవార్డులో హైదరాబాద్ నార్కోటిక్ వింగ్ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. 

ఈ అవార్డును హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్  డీజీ సీవీ ఆనంద్ దుబాయ్ పోలీస్ ఆఫీసర్స్ క్లబ్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అందుకున్నారు. హైదరాబాద్ పోలీసులకు అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు లభించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ పోలీస్‌ నెంబర్‌‌లో నిలవడం గర్వంగా ఉందన్నారు. డ్రగ్ ఫ్రీ తెలంగాణ  కోసం తన కలలను సాకారం చేస్తున్న పోలీసులకు ఎప్పుడు మద్దతుగా ఉంటానని స్పష్టం చేశారు. ఈ మేరకు  ఎక్స్‌ వేదికగా ముఖ్యమంత్రి పోస్ట్ చేశారు.