Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...టిఆర్ఎస్‌లోకి మాజీ ఎంపి వివేక్?
posted on: Oct 25, 2015 2:54PM

కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ గాలి వివేక్ తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్) పార్టీలో చేరనున్నారా? అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఎంపీ కేశవరావు తెలంగాణ మంత్రి హరీశ్ రావు భేటీ అయిన నేపథ్యంలో మాజీ ఎంపీ వివేక్ కూడా ఈ భేటీకి హాజరుకావడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాదు వరంగల్ ఉపఎన్నికలో భాగంగా ఆ స్థానానికి టీఆర్ఎస్ తరుపున వివేక్ ను బరిలోకి దిగమని హరీశ్ రావు కోరగా.. వివేక్ కూడా దానికి సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. నవంబర్ 4తో నామినేషన్ గడువు ముగియనుంది. కాగా వివేక్‌తో పాటు ప్రొ. సాంబయ్య, ఎర్రొళ్ల శ్రీనివాస్, రవికుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. వివేక్ లేదా రవికుమార్ ఈ ఇద్దరిలో ఎవరో ఒకర్ని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, అదివారం మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమై చర్చలు జరపనున్నారు. వరంగల్ లోక్‌సభ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలన్నదానిపై ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు.






