చంద్రబాబు ఉండవల్లిని ఫాలో అవుతారా?

పార్లమెంట్ లో వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతుండటంతో టీడీపీ,బీజేపీపై పోరుకు సన్నద్ధమవుతున్నట్లే కనిపిస్తున్నాయి తాజా పరిణామాలు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చంద్రబాబును సచివాలయంలో కలవటం,దాదాపు గంటకుపైగా చర్చించటం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబు విభజన చట్టంపై తాను గతంలో రాసిన లేఖపై చర్చించేందుకే తనను పిలిపించారని సమావేశ అనంతరం మీడియాకు తెలిపారు.

 

 

ఉండవల్లి పార్లమెంట్ లో వ్యవహరించాల్సిన వ్యూహాలపై చంద్రబాబుకు సూచనలు చేసినట్లు తెలుస్తుంది. ఉండవల్లి మొదటి నుంచి విభజన చట్టవిరుద్ధంగా జరిగిందని కేంద్రంపై పోరాటం చేస్తూనే ఉన్నారు. సుప్రీంకోర్టులో తాను వేసిన వ్యాజ్యం, రాష్ట్రపతి, ప్రధానికి గత ఏడాది తాను రాసిన లేఖల ప్రతులనూ బాబుకు అందజేశారు. రాష్ట్ర విభజన అంశంపైనా, దాని పై మోదీ చేసిన వ్యాఖ్యలపైనా పార్లమెంటు సమావేశాల్లో నిలదీయాలని సీఎంకు సూచించారు.విభజన చట్టవిరుద్ధంగా జరిగిందని పేర్కొంటూ స్వల్ప కాలిక చర్చకు నోటీసు ఇవ్వాలని చెప్పానన్నారు. మరి ఉండవల్లి ఇచ్చిన సూచనల్ని చంద్రబాబు ఫాలో అవుతారో?లేదో?.