TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రెండో రోజు విచారణలో మల్లాది.. పొంతన లేని సమాధానాలు..

Published on: Thu Jan 7, 2016 1:24PM

కల్తీ మద్య కేసులో మల్లాది విష్ణు రెండో రోజు విచారణకు హాజరయ్యారు. కల్తీ మద్యం కేసులో ఏ9 నిందితుడిగా ఉన్న మల్లాది విష్ణు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన నేపథ్యంలో ఎప్పుడైనా పోలీసులు విష్ణుని అరెస్ట్ చేయోచ్చు అనే వార్తలు వినిపిస్తున్నాయి. నిన్న విచారణలో పాల్గొన్న మల్లాది తనకు ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు.  డీఐజీ మహే్‌షచంద్ర లడ్హా దాదాపు 25 నుండి 30 ప్రశ్నల వరకూ మల్లాదిని అడుగగా దేనికి సంతృప్తికర సమాధానాలు ఇవ్వలేదని సిట్ తెలిసింది. అంతేకాదు ఈకేసుకి సంబంధించి అదుపులోకి తీసుకున్న నిందితులు విచారణలో బయటపెట్టిన అంశాలకు, విష్ణు చెబుతున్న దానికి పొంతన లేకుండా ఉన్నట్లు తెలిసింది.

దీంతో సిట్ అధికారులు గురువారం కూడా విచారిస్తున్నారు. మద్యంలో తెల్లటి ద్రావకం లాంటి పదార్ధం ఎలా కలిసిందని పోలీసులు విచారిస్తున్నారు. ఈ ప్రశ్నకు గాను ఎవరో కావాలనే ఆ ద్రావకాన్ని కలిపి ఉంటారని విష్ణు చెప్పినట్లుగా తెలిసింది.