TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సిట్ విచారణకు హాజరైన మల్లాది..

Published on: Wed Jan 6, 2016 10:42AM

కల్తీ మద్యం కేసులో ఏ9 నిందితుడిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నేడు కృష్ణలంకలోని సిట్ అధికారుల ముందు హాజరయ్యాడు. ఈ సందర్భంగా సిట్ బృందం మల్లాది విష్ణువును విచారిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా కల్తీ మద్యం కేసు నమోదైన తరువాత దాదాపు నెల రోజులు మల్లాది అజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఇంతకుముందు విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపించినా హాజరుకాలేదు. కానీ ఈరోజు కోర్టుకు హాజరుకావాలని ఆదేశించడంతో  మల్లాది విష్ణు అజ్ఞాతం వీడి బయటకు వచ్చారు.