TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టీడీపీలోకి కొండ్రు మురళి.. ముహూర్తం ఖరారు

Published on: Sat Aug 25, 2018 5:35PM

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కొండ్రు మురళి టీడీపీలో చేరుతున్నారంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే మురళి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకటరావుతో మంతనాలు జరిపారు.. సీఎం చంద్రబాబు కూడా మురళి చేరిక పట్ల సానుకూలంగా ఉన్నారు.. టీడీపీ నుండి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇక మురళి చేరిక ఎప్పుడా అంటూ చర్చలు మొదలయ్యాయి.. అయితే తాజాగా మురళి టీడీపీలో చేరికకు ఖరారు అయినట్టు తెలుస్తోంది.

 

 

ఈ నెలాఖరులోగా మురళి టీడీపీ కండువా కప్పబోతున్నట్టు తెలుస్తోంది.. ఒకవేళ కుదరని పక్షంలో వచ్చే నెల రెండవ తేదీన మురళి టీడీపీ తీర్ధం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఇదే హాట్ టాపిక్ అయింది.. కొండ్రు మురళికి శ్రీకాకుళంలో పట్టుంది.. ముఖ్యంగా రాజాం నియోజక వర్గంలో మంచి పట్టుంది.. గతం కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆయన, విభజన అనంతరం రాజకీయాలకు దూరంగా ఉన్నారు.. ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు భారీ అనుచరవర్గంతో టీడీపీలో చేరేందుకు రెడీ అయ్యారు.. అదే విధంగా విభజన అనంతరం కాంగ్రెస్ ని వీడి వైసీపీలో చేరిన కొందరు కార్యకర్తలు కూడా మురళితో పాటు ఇప్పుడు టీడీపీ గూటికి చేరే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.. మొత్తానికి మురళి రాకతో శ్రీకాకుళంలో టీడీపీ మరింత బలపడుతుందనే చెప్పాలి.