బీజేపీలో చేరిన డీకే అరుణ.. ఎంపీగా పోటీ

 

లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో సీనియర్ నేతలను బరిలోకి దింపి సత్తా చాటాలనుకుంటున్న కాంగ్రెస్ కు.. ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు అనే తేడా లేకుండా ఎన్నికలకు ముందు షాకుల మీద షాకులిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 8 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ని వీడుతున్నట్లు ప్రకటించారు. వారిలో సీనియర్ నేత, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ఉన్నారు. ఇప్పుడు వారి బాటలోనే మరో సీనియర్ నేత కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు.

తాజాగా మాజీ మంత్రి డీకే అరుణ కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌ బై చెప్పి.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ సీనియర్‌ నాయకుడు రాంమాధవ్‌ మంగళవారం అరుణ నివాసానికి వెళ్లి ఆమెతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఆమెతో ఫోన్‌లో మాట్లాడిన తరువాత ఢిల్లీ వెళ్లి రాత్రి 1 వరకు చర్చలు జరిపారు. చర్చల అనంతరం అమిత్ షా సమక్షంలో ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆమె బీజేపీ తరపున మహబూబ్‌నగర్‌ ఎంపీగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.