ప్రభుత్వాధినేతకు రూ. 200 కోట్ల మధ్యం ముడుపులు?
Published on: Mon Oct 8, 2012 2:41PM
మద్యం ధరల పెంపుదలలో కీలక నిర్ణయం తీసుకున్న ఒక ప్రభుత్వాధినేతకు 200 కోట్ల రూపాయల వాటా వచ్చినట్లు తెలుస్తున్నది. అటు ప్రభుత్వానికి, ఇటు మద్యం ఉత్సత్తిదారులకు ఏ విధమైన ఖర్చు లేకుండా మద్యం ప్రియులపై సుమారు 3,500 కోట్ల రూపాయల భారాన్ని వేశారు. దీనిపై ఎక్సైజ్ కమిషనర్, ఎక్సైజ్ ఇన్‌చార్జి మంత్రి పార్థసారథి, ముఖ్యమంత్రితో కలిసి మద్యం ధరలను పెంచేందుకు నిర్ణయించించారు. మద్యం ఉత్పత్తి దారులకు సుమారు 2000 కోట్ల రూపాయలు, ప్రభుత్వానికి 600 కోట్లరూపాయలు, కాగా మిగిలిన మొత్తాన్ని అటు రాజకీయనాయకులకు, ఇటు అధికారులకు ముడుపులుగా ముట్టవచ్చని తెలుస్తున్నది. దీనిలో ప్రభుత్వాధినేతకు వాటా 200 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వాధినేత సోదరుడు ఈ లావాదేవీల విషయంలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.


