ఐసిస్ పై యురోపియన్ పార్లమెంటరీ రిపోర్ట్ కలకలం..
Published on: Mon Dec 7, 2015 3:06PM

ఇప్పటికే ఆగ్రరాజ్యాలన్నీ ఐసిస్ ఎప్పుడు దాడులు చేస్తుందా అని భయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో యురోపియన్ పార్లమెంటరీ విడుదల చేసిన రిపోర్ట్ కలకలం రేపుతుంది. ఐసిస్ దగ్గర జీవ రసాయన ఆయుధాలు ఉన్నాయని.. ఎప్పుడైన దాడులు జరగొచ్చని ప్రజల్ని హెచ్చరించింది. అంతేకాదు వీటి తయారీకి ఐసిస్.. ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో నిపుణులైన వారిని తీసుకుందట. ఇప్పటికే యూరప్ లోని పలు దేశాలకు రసాయన ఆయుధాలు వచ్చాయని తెలిపారు. అంతేకాదు బ్రిటన్ పై దాడులు చేస్తామని ఐసిస్ హెచ్చరించింది.


