TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎత్తిపోతల అవినీతి పథకం

Published on: Mon Feb 20, 2012 9:53AM

మహబూబ్ నగర్ జిల్లా: మహబూబ్ నగర్ జిల్లా కొత్త కోట సమీపంలో ప్రభుత్వం సుమారు రూ.20 కోట్ల వ్యయంతో ఏడేళ్ళక్రితం నిర్మించిన నెల్విడి - నర్సింగాపురం ఎత్తిపోతల పథకం అవినీతి కారణంగా మూలపడింది. ఫలితంగా నెల్విడి, నర్సింగాపురం, కొన్నూరు, ద్వారకానగర్ గ్రామాల్లో సుమారు మూడువేల ఎకరాల సాగుభూమి నీరులేక ఎండిపోతుంది. ఈ పథకాన్ని చేపట్టిన వ్యక్తికి గాని సబ్ కాంట్రాక్టరుకు గాని అనుభవం లేకపోవడంతో నాసిరకం పనులు జరిగాయి. పైపులైన్లు తరుచు లీకవుతున్నాయి. అప్పట్లో ఈ కాంట్రాక్టర్ కొందరు రాజకీయ నాయకులు, అధికారులతో కుమ్మక్కై ఎత్తిపోతల పథకాన్ని నాసిరకంగా నిర్మించి తమ కడుపులు కొట్టాడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో సుమారు రూ.10 కోట్లు దుర్వినియోగం అయిందని వారు ఆరోపిస్తున్నారు.