బిగ్ బ్రేకింగ్ : ఈటల రాజేందర్ వాహనాలు సీజ్.. పీఆర్వో అరెస్ట్
Published on: Sat Oct 30, 2021 3:48PM
హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ లో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. పోలింగ్ కేంద్రాల దగ్గర టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఘర్షణ పడుతున్నారు. డబ్బులు పంచుతున్నారని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించుకుంటున్నారు. దీంతో పలు పోలింగ్ కేంద్రాల దగ్గర తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి.
బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు పోలీసులు షాకిచ్చారు.హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం మరిపెల్లిగూడెంలో ఈటల కాన్వాయ్‌లోని మూడు వాహనాలను పోలీసులు సీజ్ చేసి, పీఆర్వోను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. అంతకుముందు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్న ఈటల రాజేందర్‌పై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు టీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. పదుల సంఖ్యలో కార్యకర్తలతో పోలింగ్ కేంద్రాలకు వెళుతున్నారని ఆరోపించింది.


