హుజరా..వార్ వన్‌సైడ్.. ఈటలనా మజాకా..
Published on: Tue Nov 2, 2021 11:23AM
హుజరాబాద్‌లో వార్ వన్‌సైడ్‌గా మారింది. రౌండ్ రౌండ్‌లో ఈటల రాజేందర్ దూసుకుపోతున్నారు. జస్ట్ పోస్టల్ బ్యాలెట్ మినహా.. నియోజకవర్గం మొత్తం బీజేపీదే హవా. ఒక్కొక్క ఈవీఎమ్ ఓపెన్ చేస్తుంటే.. అధికార పార్టీకి గుండెదడ పెరిగిపోతోంది. ఈ రౌండ్‌లోనూ మళ్లీ ఓటమేనా అన్నట్టు గెల్లుకు ముచ్చెమటలు పడుతున్నాయి. ప్రగతిభవన్‌లో కూర్చొని టీవీల్లో రిజల్ట్స్ చూస్తున్న సీఎం కేసీఆర్‌కు బీపీ రైజ్ అవుతోందట. పక్కనే డాక్టర్‌ను పెట్టుకొని మరీ హుజురాబాద్ ఫలితాలు పరిశీలిస్తున్నారట. కారు పార్టీలో అంతలా కలవరం.. అంతకు మించి కలకలం.
5 మండలాలు. ఏ మండలంలోనూ కారు పార్టీకి ఆశలు లేవు. అంతా కాషాయం రెపరెపలే. కాకపోతే మెజార్టీ కాస్త తగ్గుతోందంతే. ఇలా హోరాహోరీగా సాగిన ఎలక్షన్‌లో ఆ మాత్రం టైట్ ఫైట్ తప్పదు. ఎంత మెజార్టీ కంటే.. గెలిచామా లేదా అన్నదే మేటర్. సగం కౌంటింగ్ కాకముందే.. హుజురాబాద్ ఫలితాలపై క్లారిటీ వచ్చేసింది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌దే విజయకేతనం అని డిసైడ్ అయిపోయింది.
ఓటర్లు తఢాకా చూపించారు. రాజ్యం అహంకారానికి తగిన బుద్ధి చెప్పారు. డబ్బులు ఎరేసి.. ఓట్లు దండుకోవచ్చనే కుతంత్రాన్ని.. అదే ఓటుతో చాచిపెట్టి కొట్టారు. ఈవీఎంలో పువ్వు గుర్తుపై బటన్ గుద్దితే.. ఆ దెబ్బ నేరుగా సీఎం కేసీఆర్‌కు తగిలింది. 20 ఏళ్ల సహచరుడిని కరివేపాకులా తీసిపారేస్తే.. ఆయన త్రాచుపాములా బుసలు కొడుతూ హుజురాబాద్ బరిలో నిలిచారు. బానిస భవన్‌గా మారిన ప్రగతి భవన్ గోడలను బద్దలు కొట్టేలా విజయంతో తిరిగి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. ఈటల ఈటెల నుంచి ఇక కాస్కో కేసీఆర్..


