TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మందులు, వైద్య పరికరాలపై టాక్స్ ఎత్తివేయండి! వీడియో కాన్ఫ‌రెన్స్‌లో ఈటెల

Published on: Fri Apr 10, 2020 5:40PM

తెలంగాణలో 8500 మందికి పరీక్షిస్తే 471 మందికి పాజిటివ్ కేసులు వ‌చ్చాయ‌ని వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డా. హర్షవర్ధన్ రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ మంత్రులతో నిర్వహించిన విడియో కాన్ఫరెన్స్ లో హైదరాబాద్ BRKR భవన్ నుండి మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. 

రాష్ట్రం, దేశంలో తయారవుతున్న మందులు, వైద్య పరికరాలపై టాక్స్ ఎత్తివేయాలని, అదేవిధంగా విదేశాల నుండి దిగుమతి చేసుకొనే వైద్య పరికరాలను కస్టమ్స్, టాక్స్ రద్దు చేయాలని ఈ సంద‌ర్భంగా ఈటెల‌ కోరారు. 

వెంటిలేటర్ లు, ఇతర వైద్య పరికరాలు ECIL, DRDO లాంటి సంస్థల్లో తయారుచేసి ప్రభుత్వాలకు అందజేయాలని కోరిన మంత్రి ఈటల రాజేందర్. N-95 మాస్కులు, PPE కిట్స్, టెస్టింగ్ కిట్స్ సాధ్యమైనంత త్వరగా అందజేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. 

వైద్య పరికరాలు మరియు కరోనా నియంత్రణ కోసం వినియోగిస్తున్న వాటిని బ్లాక్ మార్కెట్ చేయకుండా నియంత్రించాలని, కేంద్ర ప్రభుత్వమే సేకరించి రాష్ట్రాలకు అందించాలని మంత్రి ఈటల కోరారు. 

ఇప్పటివరకు తెలంగాణలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరగలేదు అని, ఇక్కడ వచ్చిన పాజిటివ్ కేసుల్లో 85% మర్కజ్ నుండి వచ్చినవే, ఇవి తగ్గితే కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది అని కేంద్ర మంత్రి కి తెలిపిన ఈటల రాజేందర్. 

తెలంగాణ లో ఇప్పటికీ 8500 మందికి పరీక్షలు చేస్తే 471 మందికి పాజిటివ్ అని తేలింది. 45 మంది కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా , 12 మంది చనిపోయినట్లు తెలిపారు.
లాక్ డౌన్ పొడిగించే అంశంపై అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాలని కూడా మంత్రి సూచించారు.