TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎర్రబెల్లి ఖాతాలో మరో శత్రువు..

Published on: Sat Jan 16, 2016 3:23PM

టీడీపీలో రోజుకో సమస్య తలెత్తుతుంది. ఒక సమస్య అయిపోయింది అంటే మరో సమస్య వెంటనే తెరపైకి వస్తుంది. గతంలో ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డిల మధ్య గొడవ.. వారి గొడవ కాస్త నెమ్మదించగా.. ఇటీవల స్పీకర్ కోడెల.. యనమల రామకృష్ణ మధ్య విభేధాలు.. ఇప్పుడు తాజాగా కొత్త ఇన్‌చార్జులను ఎంపిక విషయంలో కష్టాలు వస్తున్నాయి. కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు టిఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే. దీంతో  ఆ నియోజకవర్గానికి ఇన్ చార్జీగా ఎవరు ఉండాలనే అంశంపై ఇద్దరు టీడీపీ సీనియర్ నేతల మధ్య వివాదం ఏర్పడింది.

తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తన అల్లుడు మదన్ మోహన్ కు ఆ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాలని గట్టిగా పట్టుబడుతున్నారు. మరోవైపు ఇదే నియోజక వర్గానికి ఇన్‌చార్జ్ బాధ్యతను తాను చూస్తానని పెద్దిరెడ్డి పార్టీ నేతల సమావేశంలో చెప్పారంట. అంతేకాదు తనకు కుకట్ పల్లి ఇన్ చార్జి బాధ్య‌తలు ఇవ్వకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పెద్దిరెడ్డి హెచ్చరించారట. దీంతో ఇప్పుడు ఈ నియోజక వర్గానికి ఇంఛార్జ్ బాధ్యతల విషయంలో టీడీపీకి కష్టాలు వచ్చి పడ్డాయి. అయితే ఎన్నికల వరకూ ఈ ఇద్దరు నేతలు కలిసి ఇంఛార్జ్ బాద్యతలు చూసుకోవాలని.. ఆతరువాత నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు సూచించారట. ఇదిలా ఉండగా ఎర్రబెల్లి ఖాతాలో మరో శత్రువు వచ్చి చేరినట్టుయింది. ఇప్పటికే రేవంత్ రెడ్డితో పోరు సాగుతుంది ఇప్పుడు మళ్లీ పెద్దిరెడ్డి రూపంలో మరో శత్రువు వచ్చి చేరినట్టయిందని రాజకీయ వర్గాలు చర్చింకుంటున్నాయి.