పయ్యావులతో ఎర్రబెల్లి ఢీ

 

Errabelli vs Payyavula, chandrababu, telangana, samaikyandhra, tdp, telangana state, congress

 

 

రాష్ట్ర విభజన విషయంలో ఇతర పార్టీల నుంచి తీవ్రమైన విమర్శల దాడిని ఎదుర్కుంటున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మరో తలనొప్పి వచ్చి పడింది. పయ్యావుల కేశవ్ విభజనను వ్యతిరేఖిస్తూ సుప్రీం కోర్టులో పిటిషను వేయడంతో,తెదేపా ఆంధ్ర, తెలంగాణా నేతల మధ్య విభేదాలకు దారి తీస్తోంది.


రాష్ట్ర విభజన ప్రక్రియు అడ్డుకోవాలని సుప్రీంకోర్టులో పయ్యూవుల కేశవ్‌ పిల్‌ వేసిన నేపథ్యంలో ఎర్రబెల్లి తీవ్రంగా మండిపడుతున్నారు. రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో తలెత్తే సమస్యలు చెప్పుకోవచ్చని, అందుకు అభ్యంతరం లేదని అన్నారు. అయితే విభజన ఆపాలని కోరడం పార్టీ నిర్ణయానికి వ్యతిరేకమని, ఇది పార్టీ క్రమశిక్షణా రాహిత్యం కిందకు వస్తుందని దయాకర్ రావు అన్నారు. ఈవిషయమై చంద్రబాబుకి పిర్యాదు చేసి పయ్యావులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.