TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆ ముగ్గురితో అఫైర్లు వాస్తవమే.. పేర్లు బయటపెట్టిన బిల్ గేట్స్

Published on: Thu Jun 25, 2026 9:43AM

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రతిష్ఠను మసకబార్చిన ఎన్ స్టీన్ ఫైల్స్ కు సంబంధించి సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. వాటిని స్వయంగా బిల్ గేట్స్ వెల్లడించడం విశేషం. లైంగిక నేరాలతో ప్రపంచవ్యాప్తంగా అపఖ్యాతి పాలైన  జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో తనకున్న సంబంధాలపై , బిల్ గేట్స్‌ తొలి సారి బాహాటంగా చెప్పారు. అమెరికా కాంగ్రెస్ ప్యానెల్  ఎదుట ఈ నెల 10న జరిగిన  రహస్య విచారణలో బిల్ గేట్స్  వాంగ్మూలం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా  సంచలనం సృష్టిస్తోంది. తన వ్యక్తిగత జీవితంలోని బలహీనతలను, రహస్యాలను అడ్డం పెట్టుకుని జెఫ్రీ ఎప్‌స్టీన్ తనను   బ్లాక్‌మెయిల్ చేసినట్టు బిల్ గేట్స్ వెల్లడించారు. ఈ సందర్భంగానే..  గేట్స్ తన వ్యక్తిగత జీవితంలో ముగ్గురు మహిళలతో ఎఫైర్స్ ఉన్నాయని అంగీకరించాడు.

ఈ ఎఫైర్లు.. తన వివాహం తరువాత కూడా కొనసాగించినట్లు అంగీకరించాడు.  రష్యాకు చెందిన ప్రముఖ బ్రిడ్జ్ ప్లేయర్ మిలా ఆంటోనోవా, న్యూక్లియర్ ఫిజిసిస్ట్ కరిమా నిగ్మటులినాతో తనకు  వివాహేతర  సంబంధాలు ఉన్నాయని, ఆ విషయాలన్నీ ఎప్‌స్టీన్‌కు  తెలుసని చెప్పిన బిల్ గేట్స్.. వీరిద్దరితో పాటు మెడికల్ ఆంట్రప్రెన్యూర్ ఆలిస్ జాకబ్స్ నెస్సెల్‌రోడ్ట్‌తో కూడా తనకు  ఎఫైర్ నడిచిందని అంగీరించాడు. ఈ ముగ్గురు మహిళలతో ఉన్న సంబంధాల గురించిన గుట్టును ఆయుధంగా మార్చుకుని.. తనను ఎన్ స్టీన్ బ్లాక్ మెయిల్ చేశాడన్న సంచలన నిజాలను బిల్ గేట్స్ తన వాంగ్మూలంలో చెప్పారు.  తన వ్యక్తిగత  రహస్యాలు వెల్లడి అవ్వడంతో   తన కుటుంబ సభ్యులు మానసికంగా ఎంతో బాధపడ్డారన్న బిల్ గేట్స్..

తన వివాహేతర సంబంధాల సమాచారానికి కొన్ని ఘోరమైన అబద్ధాలను కూడా తోడు చేసి, తనను భయపెట్టి, మళ్లీ తనతో వ్యాపార, వ్యక్తిగత సంబంధాలు పెట్టుకునేలా ఒత్తిడి తెచ్చేందుకు ఎప్‌స్టీన్ ప్రయత్నించాడని బిల్ గేట్స్ ఆ వాంగ్మూలంలో పేర్కొన్నారు.  ఇందుకు  సాక్ష్యంగా 2013 నాటి ఒక ఈమెయిల్ డ్రాఫ్ట్‌ను గేట్స్ ఉదహరించారు. ఆ ఈమెయిల్‌లో గేట్స్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆరోపణలతో పాటు ఆయన మాజీ ఉద్యోగి బోరిస్ నికోలిక్ ప్రస్తావన కూడా ఉంది.  నిజాలు,  అబద్ధాలను కలిపి తనను బ్లాక్‌మెయిల్ చేయడానికి ఎప్‌స్టీన్ ఆ మెయిల్‌ను సిద్ధం చేశాడని గేట్స్ వివరించారు.