TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమ్మకానికో ఆంగ్ల పత్రిక

Published on: Thu Mar 15, 2012 2:22PM

రాష్ట్రంలో ఇటీవల ప్రారంభమైన ఒక ఆంగ్ల దినపత్రిక నష్టాల ఊబిలో చిక్కుకుంది. దీంతో ఆ పత్రికను అమ్మివేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఒక చిట్ ఫండ్ కంపెనీతో ఎలక్ట్రానిక్ చానల్ పెట్టించిన ఈ పాత్రికేయుడు ప్రింట్ మీడియాతో ఉన్న తన పాత అనుభవాన్నంతా రంగరించి హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఎడిషన్ లు పెట్టి ఆంగ్ల దిన పత్రికను ప్రారంభించారు. అయితే పత్రికలో వార్తలు, వ్యాసాలే తప్ప వ్యాపార ప్రకటనలు కనిపించడం లేదు. ఏ పత్రికకైనా కనీసం 30 శాతం వ్యాపార ప్రకటనలు ఉంటే తప్ప అది బ్రేక్ ఈవెన్ కు రాదు. అయితే ఈ పత్రికకు 10 శాతం కూడా వ్యాపార ప్రకటనలు రావడం లేదు. దీంతో పత్రికను కొనడానికి ఎవరైనా ముందుకు వస్తే విక్రయించేయాలని ఆ ప్రముఖ పాత్రికేయుడు తీవ్రంగా యోచిస్తున్నట్లు తెలిసింది.