TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నాగపూర్ టెస్ట్ లో ఇండియా బౌలర్ల జోరు, ఇంగ్లాండ్ 156/5

Published on: Thu Dec 13, 2012 2:17PM

 

england india, england nagpur test, india nagpur test, england india 2012

 

నాగపూర్ లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాల్గో టెస్టులో ఇండియా బౌలర్ల జోరు కొనసాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ కు ఆదిలోనే దెబ్బతగిలింది. మూడు పరుగులకే ఇషాంత్ శర్మ కాంప్టన్ వికెట్ తీసుకున్నాడు. ఆ తరువాత కొద్దిసేపటికే ఈ సిరీస్ లో సెంచరీలు మీద సెంచరీలు చేస్తున్న కుక్ ను కూడా శర్మ అవుట్ చేశాడు.


లంచ్ బ్రేక్ తరువాత నిలకడగా రాణిస్తున్న ట్రాట్ 44 పరుగుల వద్ద జడేజా అవుట్ చేశాడు. ఇంగ్లాండ్ 119 పరుగుల బెల్ (1) తొందరగానే అవుటయ్యాడు. డేంజర్ బ్యాట్స్ మెన్ నిలకడగా ఆడుతున్న పీటర్సన్ 73 పరుగులకు జడేజా అవుట్ చేసి ఇంగ్లాండ్ ని కోలుకొని దెబ్బ తీశాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ 76 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి156 పరుగులతో బ్యాటింగ్ చేస్తుంది.