అహ్మదాబాద్ టెస్ట్ : కష్టాల్లో ఇంగ్లాండ్
Published on: Sat Nov 17, 2012 11:26AM
.jpg)
భారత్ ఇంగ్లాండ్ మధ్య అహ్మదాబాద్ లో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ 115 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 41/3 ఓవర్ నైట్ స్కోరుతో ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ బాట్స్ మెన్ లు ఎక్కువ పరుగులు చేయకుండానే వెనుదిరిగారు. భారత్ స్పిన్నర్ ఓజా ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి ఇంగ్లాండ్ ను కష్టాల్లోకి నెట్టాడు. పీటర్సన్ 17, కెప్టెన్ కుక్ 41, సమిత్ పటేల్ 10, బెల్ 0 పరుగులకే అవుటయ్యారు. భారత బౌలర్లలో ఓజా, అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టగా ఉమేష్ యాదవ్ ఒక వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను ఎనిమిది వికెట్ల నష్టానికి 521 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన విషయం తెల్సిందే.


