TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నాలుగో టి20లోనూ టీమ్ ఇండియా ఘోర పరాజయం.. సిరీస్ ఇంగ్లాండ్ కైవసం.!

Published on: Fri Jul 10, 2026 9:09AM

ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు టి20ల సిరీస్ లో టీమ్ ఇండియా వరుసగా మూడో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో మొదటి మ్యాచ్ వర్షార్పణం కాగా,  తరువాత మూడు మ్యాచ్ లలోనూ టీమ్ ఇండియా ఘోరంగా ఓడిపోయింది.  బ్రిస్టల్‌ వేదికగా గురువారం (జులై 9) జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో   ఇంగ్లాండ్ జట్టు భారత్‌పై సునాయాస విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంగ్లాండ్ సిరీస్ కైవసం చేసుకుంది. ఇఖ నాలుగో టి20 విషయానికి వస్తే.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ ఇంగ్లాండ్ టీమ్ ఇండియాపై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించి   9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

సిరీస్ లో నిలవాలంటే గెలిచి తీరాల్సిన ఈ మ్యాచ్ లో  టాస్ గెలిచిన టీమ్ ఇండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.  అయితే టాప్ ఆర్డర్ బ్యాటర్లు చేతులెత్తేశారు.   బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పడుతున్నా  కెప్టెన్ శ్రేయస్ అయ్యర్  బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. శ్రేయస్ అయ్యర్   49 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతనికి మిగిలిన బ్యాటర్ల నుంచి ఎటువంటి సహకారం లభించకపోవడంతో టీమ్ ఇండియా  నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి  158 పరుగులు మాత్రమే చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్  20 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టగా, జోష్ టంగ్ కూడా 2 వికెట్లు తీశాడు. 

ఇక 159 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌  13.5 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఊదేశింది.  కెప్టెన్ హ్యారీ బ్రూక్  35 బంతుల్లోనే 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 79 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతడికి తోడుగా ఫిల్ సాల్ట్  42 బంతుల్లో 59 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు  151 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌ను ఏకపక్షం చేసేశారు.  

Shreyas Iyer lone battle, India vs England T20, Team India loses series, Harry Brook